AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా పెరుగుతుంది!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం కూడా ప్రధాన సమస్యగా మారిపోయింది. దాదాపు 10లో 8 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఖరీదైన ఆయిల్స్ వాడకుండా.. ప్రకృతిలో దొరికే ఒక్క మొక్క ద్వారా ఈజీగా జట్టు రాలడం, తెల్లబడడం సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jul 09, 2026 | 7:00 AM

Share
ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల హెయిర్ డైలు, నూనెలను వాడుతున్నారు. కానీ మన ప్రకృతిలో లభించే భృంగరాజ్ ఆకు ఈ సమస్యను దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుందని ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు చెబుతున్నారు. ఈ ఆకులోని ఫైటోకెమికల్స్, జుట్టుకు నలుపు రంగును ఇచ్చే 'మెలనిన్' అనే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే కణాలను ఉత్తేజపరిచి జుట్టును నల్లగా మారుస్తాయని తెలిపారు.

1 / 5
జుట్టు పెరుగుదల: అంతే కాదు ఇది జుట్టు పెరుగుదలకు కూడా తోల్పడుతుందని ఆయన తెలిపారు. జుట్టు 'కెరాటిన్' అనే ప్రోటీన్‌తో తయారవుతుందని.. కెరాటిన్‌ను ఉత్పత్తి చేసే కెరాటినోసైట్స్ అనే కణాలకు భృంగరాజ్‌ ఆకు రక్త సరఫరాను పెంచుతుందని తెలిపారు. రక్త సరఫరా మెరుగవ్వడం వల్ల పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఈ కణాలకు పుష్కలంగా లభిస్తాయి. దీంతో కెరాటినోసైట్స్ చురుకుగా పనిచేసి, వెంట్రుకల ఉత్పత్తిని, పెరుగుదలను వేగవంతం చేస్తాయి. జుట్టు పెరుగుదల మందగించిన వారికి ఇది ఒక సమర్థవంతమైన పరిష్కారం అని ఆయన తెలిపారు.

2 / 5
జుట్టు తిరిగి మొలవడం (రీగ్రోత్): సాధారణంగా ప్రతి రోజూ సుమారు 100 వెంట్రుకలు ఊడిపోయి, వాటి స్థానంలో 100 వెంట్రుకలు తిరిగి పుడతాయి. ఊడిన వెంట్రుక స్థానంలో కొత్త వెంట్రుక రావడానికి దాదాపు 21 రోజుల విశ్రాంతి సమయం ఉంటుంది. గుంటగలగర ఆకులోని ఔషధ గుణాలు ఈ విశ్రాంతి సమయాన్ని తగ్గిస్తాయి. కణాలు తక్కువ సమయంలోనే ఉత్తేజితమై, కుదుళ్లు స్టిములేట్ అవ్వడం వల్ల 10-12 రోజుల్లోనే తిరిగి వెంట్రుకలు మొలవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల జుట్టు ఒత్తుగా, చిక్కగా పెరుగుతుంది.

3 / 5
కుదుళ్లు దృఢంగా మారడానికి: జుట్టు కుదుళ్లను దృఢంగా పట్టి ఉంచడానికి చర్మంలోని కొల్లాజెన్ బ్యాండ్లు ఆరోగ్యంగా ఉండాలి. భృంగ్‌రాజ్‌ ఆకు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు ఊడిపోకుండా రక్షించి, కుదుళ్లను బలంగా నిలుపుతుంది. అలాగే ఈ ఆకులలో ఉండే విటమిన్-ఇ తలలోని పొడిదనాన్ని తగ్గిస్తుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి, తలలో ఇన్ఫ్లమేషన్ రాకుండా నివారించడమే కాకుండా చుండ్రును సైతం అదుపు చేస్తుంది.

4 / 5
ఉపయోగించే విధానం: ఈ ఆకును నూనె రూపంలో ఎలా ఉపయోగించవచ్చో ఆయన వివరించారు. నువ్వుల నూనె లేదా గానుగ ఆడించిన కొబ్బరి నూనెలో భృంగ్‌రాజ్‌ ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత నూనెను చల్లార్చి, వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ రాత్రి పూట లేదా ఇంటికి వచ్చిన తర్వాత మాడుకు, జుట్టుకు బాగా పట్టించాలి. వారానికి కనీసం నాలుగు నుంచి ఐదు రోజులు ఈ నూనెను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన నూనెల కంటే, ఇలా ప్రకృతి సిద్ధంగా ఇంట్లో తయారు చేసుకునే నూనెలే జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన సూచించారు.

5 / 5
Follow Us
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..

పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..

యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే

ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?

జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..

పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..

సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..