AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!

మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!

Samatha J
|

Updated on: Jul 09, 2026 | 8:50 AM

Share

భారతీయ సినిమాలో మైథలాజికల్ చిత్రాల హవా కొనసాగుతోంది. సాంకేతికత పురోగమించడంతో, మన ఇతిహాసాలను యానిమేషన్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో భారీ బడ్జెట్‌లతో తెరకెక్కిస్తున్నారు. మహా అవతార్ నరసింహ వంటి చిత్రాలు రూ. 400 కోట్లు వసూలు చేసి విజయం సాధించగా, ఇప్పుడు మహా అవతార్ పరశురామ్, వాయుపుత్ర, హనుమత్ సుందరకాండ వంటి అనేక ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి.

భారతీయ సినిమాలో ప్రస్తుతం మైథలాజికల్ చిత్రాల హవా కనిపిస్తోంది. మన ఇతిహాసాలను కేవలం వందల కోట్లతోనే కాకుండా, వేల కోట్లతో తెరకెక్కిస్తున్నారు. వీటికి పోటీగా, అధునాతన యానిమేషన్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో మైథాలజీని మిక్స్ చేస్తూ నిర్మాతలు సరికొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నారు.టెక్నాలజీ పెరిగాక, అడ్వాన్స్‌డ్ టెక్నికల్ హంగులతో మన ఇతిహాసాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. వారణాసి, రామాయణ, జై హనుమాన్ వంటి మైథలాజికల్ సినిమాలు ఇప్పటికే సెట్స్‌పై ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గాడ్ ఆఫ్ వార్స్ కూడా ప్రకటించారు.యానిమేటెడ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీసిన మహా అవతార్ నరసింహ గతేడాది అంచనాలు లేకుండా వచ్చి రూ. 400 కోట్లతో చరిత్ర సృష్టించింది. ఈ విజయం తర్వాత, ఇప్పుడు ఇదే ఫ్రాంచైజ్‌లో మహా అవతార్ పరశురామ్ వస్తోంది. కార్తికేయ-2 దర్శకుడు చందు మొండేటి వాయుపుత్ర పేరుతో హనుమాన్ కథను యానిమేటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఒక భారీ మోషన్ క్యాప్చర్ చిత్రం. అలాగే, అరుణ్ కుమార్ రాపోలు దర్శకత్వంలో 3D యానిమేషన్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో హనుమత్ సుందరకాండ సినిమా కూడా రాబోతోంది. ఈ విధంగా మైథాలజీ, మోషన్ క్యాప్చర్ సినిమాల కాలం నడుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌

నెలలోపే ఓటీటీలో… బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి

గేమ్ ప్లాన్ మార్చిన టాప్ బ్యూటీస్‌..

Published on: Jul 09, 2026 08:47 AM
Follow Us