Income Tax: జీవిత బీమాపై కూడా పన్ను విధించవచ్చా? ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది..!

చాలా మందికి జీవిత బీమాను తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కుటుంబ సభ్యుడు మరణించిన తర్వాత..

Income Tax: జీవిత బీమాపై కూడా పన్ను విధించవచ్చా? ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది..!
Income Tax
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2022 | 9:55 PM

చాలా మందికి జీవిత బీమాను తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కుటుంబ సభ్యుడు మరణించిన తర్వాత అతని కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కోకుండా జీవిత బీమా కాపాడుతుంది. జీవిత బీమా ఉంటే కొన్ని నిబంధనల ప్రకారం.. బీమా చేయబడిన వ్యక్తి ఏదైనా వ్యాధి లేదా ప్రమాదం కారణంగా మరణిస్తే, మరణించిన వ్యక్తి కుటుంబానికి బీమా కంపెనీ ద్వారా డబ్బు అందజేస్తుంది. అంతే కాకుండా జీవిత బీమా ద్వారా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. జీవిత బీమాపై ఏయే పరిస్థితుల్లో పన్ను విధించవచ్చో తెలుసుకుందాం.

పన్ను మినహాయింపును ఎవరు క్లెయిమ్ చేయవచ్చు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. పన్ను తీసివేయబడుతుంది. మీరు ఏడాదిలోపు జీవిత బీమాపై రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేస్తే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. పన్ను మినహాయింపు పొందడానికి, మీరు మెచ్యూరిటీపై అందుకున్న మొత్తంలో 10 శాతానికి మించి తీసుకోకపోవడం అవసరం. మెచ్యూరిటీ సమయంలో అందుకున్న మొత్తం 10 శాతం కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు పన్ను మినహాయింపు ఉండదు. అంటే అటువంటి పరిస్థితిలో మీరు బీమా కోసం పన్ను చెల్లించవలసి ఉంటుంది. సాధారణ వ్యక్తికి మెచ్యూరిటీ మొత్తం పరిమితి 10 శాతం కాగా, వైకల్యం లేదా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఈ పరిమితి 15 శాతం వరకు ఉంటుంది. 2003- 2012 మధ్య పాలసీ తీసుకునే వారికి మెచ్యూరిటీ పరిమితి 20 శాతం వరకు ఉంటుంది.

బీమా మొత్తంపై ఎలాంటి పన్ను విధించబడదు

సెక్షన్ 10లోని సెక్షన్ D ప్రకారం.. మరణం తర్వాత పొందే హామీ మొత్తంపై పన్ను విధించబడదు. ఈ పన్ను మరణ ప్రయోజనం మొత్తంపై లేదా మెచ్యూరిటీపై విధించబడుతుంది. మెచ్యూరిటీ ప్రయోజనాలపై పన్ను విధించవచ్చు. మీరు 2012 తర్వాత పాలసీ తీసుకున్నట్లయితే, ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి