04 January 2025

సొంతింటి కల నిజం చేసుకోవాలా.. ఈ టిప్స్ పాటించాల్సిందే!

TV9 Telugu

Pic credit - Pixabay

సొంతంగా ఇళ్లు కట్టుకోవాలని ఎవరికీ ఉండదు, కానీ కొందరు తమ డ్రీమ్ నెరవేర్చుకుంటే మరికొందరికి సొంతింటి కల నెరవేరడం అనేది చాలా ఆలస్యం అవుతుంది.

దానికి ముఖ్య కారణం సరైన ప్లానింగ్ లేకపోవడం, ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కువగా లోన్స్ పై ఆధారపడటం.

అందుకే, సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి ప్లానింగ్ చేసుకోవడం బెటరో, ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇల్లు కట్టుకోవడం లేదా, కొనుగోలు చేయాలి అనుకుంటే, దానికి మీ ఆర్థిక పరిస్థితిని ముందుగా అంచనా వేసి సరైన బడ్జెట్ పెట్టుకోవాలి.

ఇల్లు కట్టుకోవడానికి ముందు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి, అందరి ఏకాభిప్రాయంతో సరైన ప్రణాళికను వేసుకోవాలి.

ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించుకోవాలి,ఒక వేళ ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు రిజిస్ట్రేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఇల్లు కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు, మార్కెట్ వాల్యూను చెక్ చేసి, స్థానికులతో మాట్లాడాలి.

ఆన్‌లైన్‌లో కూడా ఇంటి ధరలను చెక్ చేయాలి. దీని వలన మీరు,డెవలపర్ లేదా విక్రేతలతో సరైన రేటు అడగగలుగుతారు, దీంతో మీకు కాస్త ఆదా అవుతుంది.