ఆస్ట్రేలియాలో అరంగేట్రం.. 9వేల పరుగులు, 650 వికెట్లు.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్

Rishi Dhawan Retires From Limited Over Cricket: ఓ వైపు ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా ఘోర పరాజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్ ఆటగాళ్ల నుంచి రిటైర్మెంట్ చేయాలంటూ డిమాండ్లు వస్తుండగా.. మరోవైపు వీరిద్దరితో కలిసి ఆడిన ఓ భారత ఆల్ రౌండర్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. భారత ఆల్ రౌండర్ రిషి ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో గ్రూప్ దశ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ చేస్తున్నట్లు తెలిపాడు.

ఆస్ట్రేలియాలో అరంగేట్రం.. 9వేల పరుగులు, 650 వికెట్లు.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
Rishi Dhawan Retired
Follow us
Venkata Chari

|

Updated on: Jan 06, 2025 | 7:15 AM

Rishi Dhawan Retires From Limited Over Cricket: భారత ఆల్ రౌండర్ రిషి ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 34 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ ఇకపై వన్డే, టీ20 క్రికెట్ ఆడడు. దేశవాళీ క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్ తరఫున ఆడిన రిషి ధావన్ భారత్ తరపున మూడు వన్డేలు, ఒక టీ20 ఇంటర్నేషనల్ ఆడాడు. అతను ఈ మ్యాచ్‌లన్నీ 2016లో ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనతో ధావన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు.

ధావన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. ఎంతకాలం అనేది ఇంకా నిర్ణయించనప్పటికీ, అతను రంజీ ట్రోఫీ 2024-25 చివరి రెండు రౌండ్లలో ఆడనున్నాడు. ధావన్ భారత దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడిగా పేరుగాంచాడు. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 9000 పరుగులు చేశాడు. 650 కంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 134 లిస్ట్ A మ్యాచ్‌లలో, అతను 29.74 సగటుతో 186 వికెట్లు పడగొట్టాడు. అలాగే 38.23 సగటుతో 2906 పరుగులు చేశాడు. 135 టీ20 మ్యాచ్‌లు ఆడి 26.44 సగటుతో 118 వికెట్లు తీశాడు. అలాగే 121.33 స్ట్రైక్ రేట్‌తో 1740 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

రిటైర్‌మెంట్‌పై రిషి ధావన్‌ ఏం చెప్పాడంటే?

రిటైర్మెంట్ గురించి సమాచారం ఇస్తూ, ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ‘ ఎంతో బాధగా ఉంది. కానీ తప్పడం లేదు. నేను భారత క్రికెట్ (పరిమిత ఓవర్లు) నుంచి రిటైర్ అవుతున్నాను. ఈ గేమ్ నా జీవితాన్ని 20 ఏళ్లుగా ముందుకు నడిపించింది. ఈ గేమ్ నాకు చాలా ఆనందాన్ని, లెక్కలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చింది. ఇది ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

హిమాచల్ ప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిపిన ధావన్..

ధావన్ కెప్టెన్సీలో హిమాచల్ ప్రదేశ్ 2021-22లో తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. అప్పుడు అతను అత్యధిక పరుగులు చేసిన మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌గా, టాప్ 5 వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ సమయంలో 458 పరుగులు చేసి 17 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో ధావన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక్కడ అతను 2013లో ముంబై ఇండియన్స్, 2014-2024 వరకు పంజాబ్ కింగ్స్ XIలో భాగంగా ఉన్నాడు. ఈ టోర్నీలో అతను 39 మ్యాచ్‌ల్లో 25 వికెట్లతో పాటు 210 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..