హైబ్రిడ్ ఫండ్స్ గురించి విన్నారా.? ఎలా పనిచేస్తాయంటే.?
TV9 Telugu
04 January
202
5
మీకు హైబ్రిడ్ కారు గురించి తెలుసా..? పెట్రోల్ అలాగే బ్యాటరీ రెండిటిపైనా ఆధారపడి ఈ కార్లు నడుస్తాయి.
పెట్రోల్ అయిపోతే.. బ్యాటరీ తో కారు నడుస్తుంది. అలాగే.. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా హైబ్రిడ్ ఫండ్స్ పనిచేస్తాయి.
హైబ్రిడ్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఈక్విటీతో పాటుగా డెట్, గోల్డ్ ఇలా ఇతర విధానాలలో కూడా ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి.
ఒకవేళ ఒకదానిలో నష్టం వచ్చినా రెండో దానిలో లాభం రావచ్చు. అలా లాభనష్టాలను బ్యాలెన్స్ చేసి రిస్క్ తగ్గిస్తాయి.
ఈ ఫండ్స్ ఆరు రకాలుగా ఉంటాయి. అయితే, ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే చేయడం మంచిది.
హైబ్రిడ్ ఫండ్స్ పూర్తి రిటర్న్స్ ఇస్తాయని చెప్పలేం అలాగే పూర్తిగా రిస్క్ లేకుండా ఉంటాయనీ చెప్పలేం.
ఫండ్ ఎలోకేషన్ మీద ఆధారపడి రిస్క్ ప్రొఫైల్ ఉంటుంది. ఈ ఎలోకేషన్ ఫండ్ మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇతర ఫండ్స్ తో పోలిస్తే ఈ హైబ్రిడ్ ఫండ్స్ లో రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది అంతే. అందుకే ఈ ఫండ్స్ ఉపయోగకరం.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ విషయంలో బంగారం, వాజ్రం కంటే వెండికి విలువ ఎక్కువ.!
ఈ యాప్‌తో బంగారం స్వచ్ఛతను తెలుసుకోండిలా..
డెబిట్ కార్డులకు కాలం చెల్లిపోతుందా.?