Indian Railway: దేశంలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు అందుబాటులో వస్తుందో తెలుసా..? కీలక ప్రకటన చేసిన రైల్వే మంత్రి

దేశంలో బుల్లెట్ రైలు గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. బుల్లెట్ రైలుకు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు 2026లో నడుస్తుందని..

Indian Railway: దేశంలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు అందుబాటులో వస్తుందో తెలుసా..? కీలక ప్రకటన చేసిన రైల్వే మంత్రి
Bullet Train
Follow us

|

Updated on: Oct 07, 2022 | 9:19 PM

దేశంలో బుల్లెట్ రైలు గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. బుల్లెట్ రైలుకు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు 2026లో నడుస్తుందని చెప్పారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు ఎంత వరకు పూర్తయ్యాయో రైల్వే మంత్రి వివరించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు 2026లో అందుబాటులోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతం దీని కోసం 92 స్తంభాలను సిద్ధం అయ్యాయని, ఇందుకోసం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ను నిర్మించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు 199 స్టేషన్లను ప్రపంచ స్థాయికి చేర్చేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు చెప్పారు.

మాస్టర్ ప్లాన్ కింద ప్రపంచ స్థాయి స్టేషన్లు

ఈ మాస్టర్ ప్లాన్ కింద అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రపంచ స్థాయికి చేర్చనున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. రైల్వేలో ప్రయాణించే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఇందులో ఇప్పటివరకు 6105 రైల్వే స్టేషన్‌లో ప్రజలకు ఉచిత వై-ఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. బుల్లెట్‌ రైలులో అత్యాధునిక సదుపాయాలను పొందుపరుస్తున్నారు. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు 2026లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. బుల్లెట్ ట్రైన్‌ ఎప్పటి నుంచో భారతీయుల కల. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది మోదీ సర్కార్. దేశంలో ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ఆ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. బుల్లెట్‌ ట్రైన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. మెరుగైన సదుపాయాలతో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఈ రైలులో  ప్రయాణిస్తే అద్భుతమైన అనుభూతి లభిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి