రైతులకు పీఎం కిసాన్‌ 19వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా..?

05 January 2025

Subhash

పీఎం కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా ఈ డబ్బు రైతుల ఖాతాలకు బదిలీ చేస్తోంది కేంద్రం.

పీఎం కిసాన్

రూ.2,000 చొప్పున ఏడాదిలో మూడు వాయిదాలలో రైతులకు అందిస్తుంది. ఈ పథకంలో ఇప్పటివరకు 18 విడతలు విడుదల కాగా ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

ఏడాదిలో

మునుపటి అంటే 18వ భాగం అక్టోబర్‌లో విడుదలైంది. దీని ప్రకారం, తదుపరి విడత అంటే 19వ విడత సమయం ఫిబ్రవరిలో ఉండవచ్చు. 

19వ విడత

గతేడాది ఫిబ్రవరి 28న 16వ భాగం విడుదల కావడంతో ఈసారి కూడా 19వ భాగం ఫిబ్రవరి 28న వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

గతేడాది

దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఫిబ్రవరితో నాలుగు నెలల గడువు ముగియనుంది. ఫిబ్రవరి 28న వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అధికారిక ప్రకటన

e-KYC ప్రక్రియను పూర్తి చేయని రైతులు తదుపరి విడతను పొందలేరని గుర్తించుకోండి. మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవాలంటే, మీరు ప్రధానమంత్రి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

కేవైసీ

లేదా కిసాన్ యోజన ఈ నంబర్లలో సంప్రదించండి. రైతులు ఏ విధమైన సమస్యలను అయినా ఎదుర్కొంటే, వారు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. ఈ మార్గాల ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.

హెల్ప్‌లైన్

ఇమెయిల్ ఐడి: pmkisan-ict@gov.in , హెల్ప్‌లైన్ నెం: 155261, 1800115526 (టోల్ ఫ్రీ), లేదా 011-23381092కి కాల్ చేయవచ్చు. ఈ PM కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వం పథకం.

హెల్ప్‌లైన్