AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oil Prices: వినియోగదారులకు షాక్‌.. పెరిగిన వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?

Edible Oil Prices: ఇప్పుడు వంట గది బడ్జెట్‌ మరింతగా పెరగనుంది. ఎందుకంటే ఆయిల్‌ ధరలు పెరిగాయి. ఇటీవల నుంచి తగ్గిన ఆయిల్ ధరలు.. ఇప్పుడు 20 శాతం వరకు పెరగడంతో ఖర్చు పెరగనుంది. గత కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న ఆయిల్‌ ధర ద్రవ్యోల్బణంతో దెబ్బతింది..

Edible Oil Prices: వినియోగదారులకు షాక్‌.. పెరిగిన వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?
Subhash Goud
|

Updated on: Jan 05, 2025 | 8:07 PM

Share

గత కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న ఆయిల్‌ ధర ద్రవ్యోల్బణంతో దెబ్బతింది. సోయాబీన్ ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం 20 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ పరిణామాలన్నింటి కారణంగా ఎడిబుల్ ఆయిల్ ధర దాదాపు 30 శాతం పెరిగింది. నవీ ముంబైలోని ఏపీఎంసీ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగాయి. గత కొద్ది రోజులుగా ఎడిబుల్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. లీటర్ నూనె 20 నుంచి 25 రూపాయలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

రెండేళ్ల క్రితం దేశంలో ద్రవ్యోల్బణం ఎగసిపడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీనికి తోడు రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. అప్పట్లో పామాయిల్, ఇతర నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుది. దీంతో దేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

వాశిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు నెలకు 7 నుంచి 8 టన్నుల నూనె దిగుమతి అవుతుంది. కానీ డిమాండ్ పెరగడంతో ఆయిల్‌ ప్రవాహం తగ్గింది. ఎక్కువ డిమాండ్‌, సరఫరా తక్కువగా ఉండటంతో ఎడిబుల్‌ ఆయిల్‌ ధర పెరిగింది. చమురు ధరలు 30 శాతం పెరిగాయని ఏపీఎంసీ వ్యాపారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పొద్దుతిరుగుడు నూనె గతంలో కిలో రూ.120 ఉండేది. ఇప్పుడు కిలో ధర 20 రూపాయలు పెరగడంతో కిలోకు రూ.140కి చేరింది. పామాయిల్ కిలో రూ.100 పలికింది. ఇక పామాయిల్‌ ధర కూడా రూ.35-రూ.40 వరకు పెరగడంతో ప్రస్తుతం ఈ ధర 135-140 రూపాయలకు చేరుకుంది. ఇక సోయాబీన్ నూనె కిలో రూ.115-120 నుంచి నేరుగా రూ.130-135కి చేరింది. కిలో రూ.20 ధర పెరుగుదల కనిపిస్తోంది. చలికాలంలో వినియోగదారులు ఆయిల్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Electric Blanket: ఈ చలికాలంలో వెచ్చగా ఉండే ఎలక్ట్రిక్‌ దుప్పట్లు.. ఆన్‌లైన్‌లో తక్కువ ధరల్లో..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి