Fastest growing economy: ప్రగతి పథంలో దేశం పరుగులు.. ప్రపంచంలో కీలకంగా మారే అవకాశం
మన దేశం అన్ని రంగాలలో ప్రగతి పథంలో పరుగులు తీస్తోంది. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుసంతరించుకుంటోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేరు తెచ్చుకుంటోంది. కష్టించి పనిచేసే మనస్తత్వం కలిగిన ప్రజలు, సుస్థిర రాజకీయ వ్యవస్థ, పెరుగుతున్న అవకాశాలు.. ఇలా ఎన్నో కారణాలు దీని వెనుక ఉన్నాయి. ఏదేమైనా దేశ ప్రజలందరూ గర్వించదగిన విషయం ఇది. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇటీవల చేసిన ప్రసంగం దీనికి నిదర్శనంగా నిలిచింది.
చెన్నైలోని ఎన్ ఐటీ తిరుచ్చిలో ఇటీవల గ్లోబల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రశేఖరన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశ ప్రగతి తదితర విషయాలపై ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా మూడు విషయాలను ఆయన ప్రస్తావించి, అవి దేశానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. చంద్రశేఖరన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలను గమనిస్తే.. దేశంలోని ఆర్థిక ప్రగతి ఈ ఏడాది కొంచెం మందగించినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. పునరుత్పాదక శక్తిగా మారడం, గ్లోబల్ సప్లయి చైన్ డైనమిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అనే మూడు అంశాలు మనకు అనుకూలంగా మారుతున్నాయి. ఇతర దేశాలలో పోల్చితే మనం బలంగా ఎదుగుతున్నాం. ఇంకా అభివృద్ధిని సాధిస్తాం. ప్రగతి పరుగులు మరింత వేగంగా కొనసాగుతాయి.
ఆర్టిఫిషియన్ ఇంటిలిజెన్స్ (ఏఐ)కు 2025 బాగా కలిసివస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది చిన్నభాషా సమూహాలు (ఎస్ఎల్ఎం)లో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పెద్ద భాషా సమూహాలు (ఎల్ఎల్ఎం) వాటిని ప్రగతిని కొనసాగిస్తాయి. తక్కువ ఖర్చు, తక్కువ శక్తితో వేగవంతమైన ఫలితాలను అందిస్తాయి. చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోంది. దీని వల్ల మన దేశానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రపంచ వృద్ధిలో చైనా వాటా దాదాపు 30 శాతం ఉండేది. అది ప్రస్తుతం 25 శాతానికి పడిపోయింది. వచ్చే మూడు, నాలుగేళ్లలో దాదాపు 20 శాతానికి తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ దేశంలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలు దీనికి ప్రధానం కారణం.
మన దేశంలో నెలకొన్న కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అసమానత, వృద్దుల సంక్షేమం, కార్మిక ఉత్పాదకత, ఉద్యోగ కల్పన వంటి సవాళ్లను దాటాలి. మన బలాలలో డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అత్యంత ప్రధానమైంది. కానీ దీని అమలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మన పేమెంట్ సిస్టమ్, ఆధార్, హెల్త్ కేర్, రిటైల్ బ్యాంకింగ్ సిస్టమ్ అత్యున్నతమైనవి. పునరుత్పాదకశక్తిలో మన దేశం భారీ ప్రగతి సాధిస్తోంది. ఈ రంగ ఆధారిత విద్యుత్ 45 శాతానికి చేరుకుంది. గతం దశాబ్డంలో ఇది కేవలం 30 శాతంగా ఉండేది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి