తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కోసం టర్మ్ పాలసీలను ఎంచుకుంటాం. అయితే.. టర్మ్ పాలసీ క్లెయిం చాలా సందర్భాల్లో రిజెక్ట్ అవుతుంది.
అసలు మన టర్మ్ పాలసీ క్లయిం ఎందుకు రిజెక్ట్ అవుతుందో అనే విషయాన్ని ఇప్పుడు డీటెయిల్ గా తెలిసుకుందాం..
టర్మ్ పాలసీ తీసుకునేటప్పుడు పాలసీదారులకు ఉన్న తీవ్రమైన వ్యాధులను దాచిపెడితే క్లెయిం రిజెక్ట్ అవుతుంది.
పాలసీ తీసుకునే సమయంలో ఆదాయం, ఆరోగ్య స్థితి, మెడికల్ హిస్టరీ అన్నిటినీ నిజాయతీగా చెప్పాలి. తప్పుడు సమాచారం క్లయిం రిజెక్ట్ కావడానికి కారణం అవుతుంది.
ఇన్సూరెన్స్ ప్రీమియం టైంకి చెల్లించాలి. పాలసీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునేటపుడు ఆ కంపెనీ క్లయిం పేమెంట్స్ హిస్టరీ తెలుసుకోవాలి.
ఎక్కువగా క్లెయిమ్స్ పరిష్కరించని సంస్థ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన రిజెక్ట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఒకవేళ మీ క్లెయిమ్ ఇన్సూరెన్స్ కంపనీ రిజెక్ట్ చేస్తే కనుక ముందుగా ఆ సంస్థ బ్రాంచ్ లో విషయం తెలుసుకోండి.
బ్రాంచ్ లో ఉన్నవారు చెప్పిన కారణాలతో మీరు ఏకీభవించకపోతే ఐఆర్‌డీఏఐ ఫిర్యాదుల విభాగంలో కంప్లైంట్ చేయండి.