RBI Digital Currency: డిజిటల్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీ

డిజిటల్‌ కరెన్సీపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. త్వరలో ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీని విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే దీనిపై ప్రజలకు..

RBI Digital Currency: డిజిటల్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీ
Rbi Digital Currency
Follow us
Subhash Goud

|

Updated on: Oct 07, 2022 | 6:18 PM

డిజిటల్‌ కరెన్సీపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. త్వరలో ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీని విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ కరెన్సీ ఆదాయంపై ట్యాక్స్ విధిస్తున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా బ్యాంక్ డిజిటల్ కరెన్సీ – సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారంగా డిజిటల్ కరెన్సీ తరహాలో సెంట్రల్ బ్యాంక్ తరపున ట్రయల్స్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ త్వరలో ఈ-రూపాయిపై పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్లు చెబుతోంది. ఈ డిజిటల్ రూపాయి నిర్దిష్ట ఉపయోగం కోసం ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది.

దీనితో పాటు, రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై కాన్సెప్ట్ నోట్‌ను కూడా విడుదల చేసింది. డిజిటల్ కరెన్సీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ నోట్ ముఖ్య ఉద్దేశ్యం. తద్వారా రానున్న కాలంలో డిజిటల్‌ కరెన్సీ వినియోగాన్ని పెంచవచ్చు. అయితే సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ ఆర్బీఐ ఆధ్వర్యంలో వస్తోంది. ఇది డిజిటల్‌ ఫార్మట్‌లో స్టోర్‌ అయి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కరెన్సీకి e₹ అదనంగా ఉంటుంది. అయితే ఇతర రకాల డిజిటల్‌ కరెన్సీకి ఉన్నట్లుగానే లావాదేవీకి బెనిఫిట్స్‌ ఉంటాయి.

పైలట్ ప్రాతిపదికన ప్రత్యేక ఉపయోగం కోసం త్వరలో ఈ-రూపాయిని ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ భారతదేశంలో డిజిటల్ కరెన్సీని పరీక్షిస్తోంది. ఇ-రూపాయి ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీని విడుదల చేయనుంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఎప్పుడైనా ఈ డిజిటల్‌ కరెన్సీ అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం డబ్బు కరెన్సీ నోట్ల రూపంలో ఉన్నట్లుగానే డిజిట్‌ రూపంలో కూడా ఉంటుంది. కరెన్సీ నోటుకు ఎంత విలువ ఉందో.. డిజిటల్‌ కరెన్సీకి కూడా అంతే విలువ ఉంటుంది. ప్రస్తుత కరెన్సీకి ఆర్బీఐ ఎలా బాధ్యత తీసుకుంటుందో ఈ డిజిటల్‌ కరెన్సీకి కూడా అంతే బాధ్యత వహిస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

డిజిటల్ కరెన్సీ సాంకేతికత, డిజైన్ ఎంపికలు, డిజిటల్ కరెన్సీ ఉపయోగాలు, డిజిటల్ కరెన్సీని జారీ చేసే విధానం వంటి కీలక అంశాలను రూపొందిస్తోంది ఆర్బీఐ. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వంపై సీబీడీటీ పరిశీలన చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ