ITR Filing Update: మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదా? గడువు విధించిన ప్రభుత్వం

మీరు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే కొన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. గడువులోగా ట్యాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడం ముఖ్యం. లేకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది...

ITR Filing Update: మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదా? గడువు విధించిన ప్రభుత్వం
ITR Filing Update
Follow us
Subhash Goud

|

Updated on: Oct 07, 2022 | 5:06 PM

మీరు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే కొన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. గడువులోగా ట్యాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడం ముఖ్యం. లేకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. అందుకు జరిమానా కూడా చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. మీరు డిసెంబర్ 31 వరకు ఆలస్య రుసుముతో ఆదాయపు పన్నును ఫైల్ చేయవచ్చు. వాస్తవానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. 2021-22 ఆర్థిక సంవత్సరం మరియు 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు జూన్ 15, 2022 నుండి ప్రారంభమైంది. ఇది జూలై 31న ముగిసింది. దీంతో పాటు ఆదాయపు పన్ను దాఖలుకు సంబంధించి ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి కూడా పన్ను దాఖలుకు చివరి తేదీని పొడిగించాలని భావించగా, ప్రభుత్వం దానిని పొడిగించలేదు. గడువులోగా ఫైల్‌ చేయకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఆడిట్ అవసరమైన వారికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 31, 2022. అంటే అటువంటి వ్యక్తులు అక్టోబర్ 31 లోపు పన్ను చెల్లించడం తప్పనిసరి.

అక్టోబర్ 31లోపు మీ రిటర్న్‌ను ఫైల్ చేయండి

2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2022 కాగా, ఆలస్య రుసుముతో పన్ను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31. అంటే ఇప్పుడు మీరు సెక్షన్ 234A కింద, ఆదాయపు పన్ను సెక్షన్ 234F కింద జరిమానాతో పాటు పన్నుపై వడ్డీని చెల్లించాలి.

 ఐటీఆర్ ఫైల్ చేయడాని గడువు

వ్యక్తిగత హెచ్‌యూఎఫ్‌ కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2022 అని గమనించాలి. అదే సమయంలో, ఆడిట్ అవసరమైన వారికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 31, 2022. వ్యాపారం కలిగి ఉన్నవారికి, టీపీ TP నివేదిక అవసరమైన వారికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30, 2022. అంటే, అన్ని రకాల ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఆ శాఖ గడువు వివరాలు తెలిపింది. మీరు గడువు కంటే ముందు పన్ను చెల్లించకపోతే మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి