High Prices Of Vegetables: క్యాలీఫ్లవర్ కిలో రూ.100, వంకాయ రూ.80.. మండిపోతున్న కూరగాయల ధరలు.. ఎక్కడంటే
ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులకు భారంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కూరగాయల ధరలు పెరిగాయి..
ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులకు భారంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడి జేబుపై భారం పెరిగి బడ్జెట్ అధ్వానంగా మారుతోంది. నోయిడాలోని కూరగాయలు, పండ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు తమకు కూడా పెరిగిన ధరకే సరుకులు అందుతున్నాయని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు.
తాజా అప్‌డేట్ ప్రకారం క్యాలీఫ్లవర్ కిలో రూ.100, వంకాయ రూ.45, టొమాటో కిలో రూ.54, రిటైలర్ బంగాళదుంపలు కిలో రూ.25-30కి విక్రయిస్తున్నారు. వంకాయ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలు అకస్మాత్తుగా ఎందుకు పెరిగిపోయాయనే దానిపై వ్యాపారలు వివరించారు. సాహిబాబాద్‌లో కూరగాయలు పండించి ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. వర్షాభావ పరిస్థితులతో కూరగాయలు, పండ్ల ధరలు ఎక్కువగా ఉండడం, రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడంతో వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు భావిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వ్యవసాయరంగంలో కూరగాయలు కుళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే గత వారంలో నవరాత్రుల సందర్భంగా నాన్‌వేజ్ తీసేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా ఆకు కూరలు, ఇతర కూరగాయలనే వండుతున్నారు. అంతేకాకుండా నవరాత్రుల సందర్భంగా చాలా మంది అన్నదానం నిర్వహించారు. దీంతో నిర్వాహకులు పెద్ద ఎత్తున కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు కూరగాయల ధరలు మరింతగా పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ధరలు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఒక్కసారిగా పెరగడం సామాన్య ప్రజలను కలవరపెడుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి