Watch Video: ఫుడ్ డెలివరీ బాయ్ కు స్వాగతం పలికిన కస్టమర్.. బొట్టుపెట్టి, హారతి ఇచ్చి.. కారణం ఏంటంటే
సెల్ ఫోన్లు ఎప్పుడైతే చేతిలోకి వచ్చాయో అప్పటి నుంచి ఆన్ లైన్ సర్వీసులు స్పీడ్ అయ్యాయి. ఏది కావాలంటే అది అరక్షణంలో అరచేతుల్లో వాలుతున్నాయి. ఒక్క క్లిక్ తో అన్ని రకాల వస్తువులు ఇంటి గుమ్మం వద్దకే చేరుకున్నాయి...
సెల్ ఫోన్లు ఎప్పుడైతే చేతిలోకి వచ్చాయో అప్పటి నుంచి ఆన్ లైన్ సర్వీసులు స్పీడ్ అయ్యాయి. ఏది కావాలంటే అది అరక్షణంలో అరచేతుల్లో వాలుతున్నాయి. ఒక్క క్లిక్ తో అన్ని రకాల వస్తువులు ఇంటి గుమ్మం వద్దకే చేరుకున్నాయి. కూరగాయలు, పాలు, పండ్లు.. ఇలా ఒక్కటేమిటి.. కాదేదీ హోమ్ డెలివరీకి అనర్హం అన్నట్లుగా వాలిపోతున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆన్ లైన్ సంస్థలు కూడా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత జనరేషన్‌లో దాదాపుగా అందరూ ఫుడ్ హోమ్ డెలివరీనే ప్రిఫర్ చేస్తున్నారు. పండుగ రోజు, పుట్టిన రోజు, పెళ్లి రోజు.. అకేషన్ ఏదైనా కచ్చితంగా రెస్టారెంట్ నుంచి ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేయాల్సిందే. ఇంట్లో దర్జాగా కూర్చుని చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకుని ఒక్క క్లిక్‌తో ఆర్డర్ పెట్టేస్తే చాలు కోరుకున్న ఫుడ్ కంచాల్లో వచ్చేస్తోంది. అయితే ఇలా ఆర్డర్ డెలివరీ చేయడంలో బాయ్స్ మెయిన్ రోల్. కస్టమర్స్ కు, సంస్థలకు మధ్య వారధిగా ఉంటూ ఆర్డర్స్ అందిస్తుంటారు. అయితే.. ఆర్డర్ కొంచెం లేట్‌గా వస్తే డెలివరీ బాయ్‌కు చుక్కలు చూపిస్తారు. కాగా, తాజాగా ఆర్డర్ చేసిన ఫుడ్‌ను తెచ్చిన డెలివరీ బాయ్‌కు ఓ కస్టమర్ వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఆ పరిస్థితిలో ఓ వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. కాగా ఆ కస్టమర్ ఆర్డర్ తీసుకుని సదరు జొమాటో డెలివరీ బాయ్ ఓ గంట ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. వర్షం, ట్రాఫిక్ జామ్ సమస్యలను ఎదుర్కొంటూ జొమాటో డెలివరీ బాయ్ ఎట్టకేలకు ఫుడ్‌ను డెలివరీ అందించాడు. అయితే, ఫుడ్‌ను డెలివరీ ఇస్తున్న సమయంలో సదరు కస్టమర్.. వినూత్నంగా స్వాగతం పలికాడు.
View this post on Instagram
ఫుడ్ డెలివరీ బాయ్ కుమార్ గుమ్మం ముందుకు వచ్చిన వెంటనే కస్టమర్.. డెలివరీ బాయ్‌కు బొట్టుపెట్టి హారతి ఇచ్చి స్వాగతం పలికాడు. ఊహించని ఈ ఇన్సిడెంట్ కు డెలివరీ బాయ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. నవ్వుతూ అలాగే నిలబడిపోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డెలివరీ బాయ్‌లు కూడా మనుషులే అని అర్థం చేసుకునే వాళ్లు ఇలాగే స్పందిస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి