AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్నీ చేస్తుండగా దూసుకొచ్చిన ఊహించని అతిథి.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

సాధారణంగా మనం రోడ్లపై వెళ్తున్న సమయంలో ఎదురుగా పాము వస్తేనే గుండె ఝల్లుమంటుంది. అలాంటది మనం కూర్చుని ప్రయాణం చేస్తున్న వాహనంలోనే పాముంటే.. వామ్మో తలుచుకుంటేనే వణుకు పుడుతుంది కదా. అయితే..

జర్నీ చేస్తుండగా దూసుకొచ్చిన ఊహించని అతిథి.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
snake video
Ganesh Mudavath
|

Updated on: Oct 08, 2022 | 2:46 PM

Share

సాధారణంగా మనం రోడ్లపై వెళ్తున్న సమయంలో ఎదురుగా పాము వస్తేనే గుండె ఝల్లుమంటుంది. అలాంటది మనం కూర్చుని ప్రయాణం చేస్తున్న వాహనంలోనే పాముంటే.. వామ్మో తలుచుకుంటేనే వణుకు పుడుతుంది కదా. అయితే మీరు ఈ వీడియోను తప్పక చూడాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పటి వరకు వాహనాలు సైలెన్సర్ లలో పాము దూరిపోవడం, ఇంజిన్ లో ఇరుక్కుపోవడం, చక్రాలకు చుట్టుకోవడం వంటి ఇన్సిడెంట్స్ ను చూశాం. కానీ వేగంగా ప్రయాణిస్తున్న కారుపైకి ఎక్కేందుకు అంతే వేగంతో పాము ఎగబడటాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అది కూడా పగ బట్టినంత కోపంతో. కానీ ఇక్కడ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులోకి దూసుకు వచ్చేందుకు అది కారుపై ఎగరడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ క్లిప్ ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతే కాకుండా షేర్ చేస్తుండటంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ కారు రోడ్డుపై ప్రయాణిస్తుంది. అదే సమయంలో అక్కడికి ఒక పాము వస్తుంది. అది కారు లోపలికి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. పైకి దూకుతూ లోపలికి చొచ్చుకునేందుకు విఫలయత్నం చేసింది. అదే సమయంలో ఆ కారులో ఓ ఫ్యామిలీ ప్రయాణిస్తోంది. అయితే కారు కిటికీలు మూసి ఉండటంతో పాము లోపలికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులో ఉన్న వారు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. పాము కారులోకి వచ్చి ఉంటే అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ని తలచుకుని భయపడుతున్నారు. అంతే కాకుండా స్నేహితులకు, బంధువులకు షేర్ చేస్తు్న్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు