బిల్డప్ బాబాయ్.. ఏడు హత్యలు చేశానంటూ విర్రవీగాడు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్.. వీడియో
బెదిరించేందుకు కత్తిపట్టుకుని రంగంలోకి దిగాడు.. ఏడు హత్యలు చేశాను.. ఇక మీ వంతేనంటూ రెచ్చిపోయాడు.. సీన్ కట్ చేస్తే.. పోలీసుల రంగ ప్రవేశంతో..

మనోడు కండలు తిరిగిన ధీరుడు.. మంచి దేహదారుఢ్యానికి తగినట్లుగానే ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు.. అంతా మంచిగానే ఉంది.. ఓ ఫైనాన్స్ సంస్థ సిబ్బందిని బెదిరించేందుకు కత్తిపట్టుకుని రంగంలోకి దిగాడు.. ఏడు హత్యలు చేశాను.. ఇక మీ వంతేనంటూ రెచ్చిపోయాడు.. సీన్ కట్ చేస్తే.. పోలీసుల రంగ ప్రవేశంతో.. మనోడు రియల్ లైఫ్ కిల్ బిల్ పాండే అయిపోయాడు.. తూచ్ అదంతా ఉత్తదే.. నన్ను నమ్మండి.. నాకు ఎలాంటి పాపం తెలీదు అంటూ బిక్కమోహమేశాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పట్టణంలోని హబీబ్‌గంజ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరుబార్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి శుక్రవారం ఓ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలోకి చొరబడి అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. తాను ఏడు హత్యలు చేశానని.. కత్తి పట్టుకుని అందర్ని బెదిరించాడు. ఈ ఘటన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బౌన్సర్‌ను అదుపులోకి తీసుకునేలోపు సుమారు 30 మందిని గంటపాటు బందీగా ఉంచారు. దీంతో బౌన్సర్ కన్నీరు పెట్టుకొని తనకు ఎలాంటి పాపం తెలియదంటూ ప్రాథేయపడ్డాడు.
ఆ వ్యక్తిని శుభం ఠాకూర్ అలియాస్ బాద్షాగా గుర్తించారు పోలీసులు. ఫైనాన్స్ సంస్థ యజమాని భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. అతని కార్యాలయాన్ని వేరే ప్రదేశానికి మార్చే ప్రక్రియలో ఉన్నాడు. సంస్థ సిబ్బంది అంతా షిఫ్టింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు ఠాకూర్ అక్కడికి చేరుకుని.. బెదిరించాడు. ”నా గురించి మీకు తెలియదు, నేను బాద్షా ఠాకూర్‌ని. ఏడు హత్యలు చేశాను. ఈ కార్యాలయం నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వను” అని ఠాకూర్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




బార్ బౌన్సర్ వీడియో చూడండి..
भोपाल में बार बाउंसर ने चाकू लहराकर फाइनेंस कंपनी के कर्मचारियों को डराया, पुलिस थाने लाई तो कान पकड़कर गिड गिडगिड़ाया @CollectorBhopal @IGP_Bpl_Rural pic.twitter.com/FQAoQEfsUG
— Rewa News Media (@rewanewsmedia) October 7, 2022
దీనిపై సీపీ మకరంద్ డియోస్కర్ స్పందించారు. కంపెనీ యజమాని.. భవనం యజమాని మధ్య అద్దె విషయంలో కొంత వివాదం ఉంది. అదే ప్రాంతంలో బీర్ బార్‌ను నిర్వహిస్తున్న యజమాని, కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడానికి తన బౌన్సర్‌ను పంపాడని తెలిపారు. ఈ ఘటనపై బౌన్సర్, తోపాటు యజమానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.
దీనిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఈ ఘటన తర్వాత బౌన్సర్ పోలీసు స్టేషన్‌లో క్షమాపణలు కోరుతున్నట్లు మరొక వీడియో బయటకు వచ్చింది. “క్షమించండి, నేను పెద్ద తప్పు చేశాను, భవిష్యత్తులో నేను దానిని పునరావృతం చేయను. దయచేసి నన్ను క్షమించండి” అని ఠాకూర్ దీనిలో ప్రాథేయపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
