Andhra Pradesh: కాకినాడలో దారుణం.. ప్రేమించడం లేదని యువతి గొంతు కోసి చంపిన ఉన్మాది..

ప్రేమంటూ వెంటబడ్డాడు. ఆమె కాదనడంతో పగ పెంచుకున్నాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేసి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా

Andhra Pradesh: కాకినాడలో దారుణం.. ప్రేమించడం లేదని యువతి గొంతు కోసి చంపిన ఉన్మాది..
Ap Crime News
Follow us

|

Updated on: Oct 08, 2022 | 2:36 PM

ప్రేమంటూ వెంటబడ్డాడు. ఆమె కాదనడంతో పగ పెంచుకున్నాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేసి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా కూరాడలో చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ పెదపూడి మండలంలోని కూరాడకు చెందిన ఓ యువతిని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం యువకుడు దారి కాసి ఆమె వస్తుండగా కత్తితో దాడి చేశాడు. అనంతరం పీక కోసి దారుణంగా చంపాడు.

శనివారం కూరాడ నుంచి కాండ్రేగులకు స్కూటీపై వెళ్తున్న యువతిని వెంబడించిన ఉన్మాది సూర్యనారాయణ.. నడిరోడ్డుపై ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే యువతి కుప్పకూలింది. ఇది చూసిన స్థానికులు 108కు సమాచారమిచ్చారు. తీవ్రంగా గాయపడిన యువతి అంబులెన్స్ వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయింది.

నేరస్థుడిని పట్టుకున్న స్థానికులు.. దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పెదపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ మృగాడిని అదుపులో తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆమెను ప్రేమ పేరుతో కొంతకాలంగా సూర్యనారాయణ వేధిస్తున్నాడని.. అయితే తన ప్రేమను కాదందన్న కోపంతో కత్తితో దాడి చేసి హతమార్చాడని స్థానికులు పేర్కొంటున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ