Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic: పరగడుపున వెల్లుల్లి తింటున్నారా..? ప్రమాదంలో పడకముందే ఈ విషయాలను తెలుసుకోండి..

ఇది కేజీల బరును తగ్గించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లి గురించి చెప్పాలంటే.. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

Garlic: పరగడుపున వెల్లుల్లి తింటున్నారా..? ప్రమాదంలో పడకముందే ఈ విషయాలను తెలుసుకోండి..
Garlic
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 07, 2022 | 9:32 PM

వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బరువు తగ్గతుంది. ఈ ప్రక్రియను పురాతన కాలం నుంచి అనుసరిస్తున్నారు. తక్కువ సమయంలో బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన ఆహారం, వ్యాయమంతోపాటు.. వెల్లుల్లిని కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే నిర్ణీత వ్యవధిలో ఫిట్ బాడీని పొందవచ్చు. ఇది కేజీల బరును తగ్గించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లి గురించి చెప్పాలంటే.. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు.. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

వెల్లుల్లిలో బరువు తగ్గడానికి సహాయపడే అనేక పోషకాలు ఉన్నాయి. అయితే, మీరు మంచి జీవనశైలిని కలిగి ఉంటే.. రెగ్యులర్ వర్కవుట్‌లతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దీంతోపాటు ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినాలి. ఇది శరీరంలో శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడే పోషకాలను కలిగి ఉంటుంది, ఇది బరువు తగ్గడంలో మరింత సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది?

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ క్యాలరీలను వేగంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మీకు చాలా కాలం పాటు నిండుగా అనిపించేలా చేస్తుంది. కొవ్వును వేగంగా కరిగించి తగ్గిస్తుంది. ఇంకా, ఇది మీ ఆకలిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లి కొవ్వును కరిగించడానికి సంబంధించినది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడే డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

  • వెల్లుల్లిని ఎక్కువగా తినడం మానుకోండి. ఎందుకంటే ఇది కడుపులో చికాకును కలిగిస్తుంది.
  • గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు వెల్లుల్లిని నివారించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది.
  • వెల్లుల్లిలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఛాతీ, కడుపు మంటను సృష్టిస్తాయి.
  • వెల్లుల్లి కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. దాని లక్షణాలు దద్దుర్లు, పెదవులలో జలదరింపు, లేదా నాలుక, డీకోంగెస్టెంట్, ముక్కు నుంచి రక్తం కారడం, దురద, తుమ్ము, కళ్ళు దురద లాంటి సమస్యలను పెంచుతుంది.

బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా తినాలి?

బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తినండి. మలబద్ధకం సమస్య ఉంటే వెల్లుల్లి తినకండి. గర్భిణీలు, పిల్లలు, తక్కువ రక్తపోటు, రక్తస్రావం రుగ్మతలు, మధుమేహం ఉన్న రోగులు ఈ ఇంటి నివారణను ఉపయోగించకూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి