Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా చేస్తే రోగి ప్రాణాన్ని సులభంగా కాపొడొచ్చు.. లైఫ్ సేవింగ్ టిప్స్..

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో వృద్ధులే కాదు యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది ఈ ప్రమాదకర గుండె జబ్బుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా చేస్తే రోగి ప్రాణాన్ని సులభంగా కాపొడొచ్చు.. లైఫ్ సేవింగ్ టిప్స్..
Heart Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 07, 2022 | 7:35 PM

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో వృద్ధులే కాదు యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది ఈ ప్రమాదకర గుండె జబ్బుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే, మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఈ రోజు అలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పబోతున్నాం.. వీటిని అనుసరించడం ద్వారా గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా రక్షించుకోవచ్చు.. ఆరోగ్యంగా ఉండోచ్చు. అలాగే ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలి..? అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించబోతున్నాం.. తద్వారా రోగి జీవితాన్ని సులభంగా రక్షించవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇలా చేయండి..

  • మీ జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోండి. ధూమపానం చేస్తుంటే శాశ్వతంగా వీడ్కోలు చెప్పండి.
  • బిజీ లైఫ్ వల్ల మనకోసం మనం 20 నిమిషాలు కూడా వెచ్చించలేకపోతున్నాం. దీనివల్ల ప్రమాదకరమైన వ్యాధులు మనల్ని చుట్టుముడతున్నాయి. అందుకే ప్రతిరోజూ 20 నిమిషాలపాటు వ్యాయామం, యోగాను మీ దిన చర్యలో భాగం చేసుకోండి.
  • మీ ఆహారం నుంచి సంతృప్త కొవ్వులు, చక్కెర, సోడియం తీసుకోవడం చాలా తగ్గించండి.
  • మీరు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే మీ ఆహారంలో చక్కెరను తగ్గించండి. ఉప్పు, చక్కెర కారణంగా చాలా సమస్యలు పెరుగుతాయి. వీటి ద్వారా రక్తపోటు పెరిగి.. గుండెపోటుకు దారి తీస్తుంది.

గుండెపోటు వస్తే మొదట ఏం చేయాలి.. ప్రాణాలను రక్షించే ఈ చిట్కాలను తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి
  1. ఎవరికైనా గుండెపోటు వస్తే, ముందుగా భయపడకుండా జాగ్రత్తలు తీసుకోండి. తెలివిగా వ్యవహరించండి. మీరూ భయాందోళనలో ఉంటే, రోగి మరింత భయపడతారు.
  2. గుండెపోటు వస్తే ముందుగా రోగిని పడుకోబెట్టి సౌకర్యవంతమైన స్థితికి తీసుకురావాలి. సాధ్యమైనంత త్వరగా రోగికి ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వాలి. ఆస్పిరిన్ వల్ల రక్తం గడ్డకట్టడం నిరోధిస్తుంది. ఇది మరణాలను 15 శాతం వరకు తగ్గిస్తుంది.
  3. ఈ సమయంలో హృదయ స్పందన మందగించి, ఆగిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే ఛాతీని నొక్కడం ద్వారా శ్వాస ప్రారంభించడానికి ప్రయత్నించాలి. దీంతో గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. దీనిని CPR టెక్నిక్ అంటారు.
  4. రోగి అంతకు కోలుకోకుంటే.. కృత్రిమ శ్వాసను అందించాలి. అటువంటి పరిస్థితిలో మీరు రోగి తలకింద దిండును తీసివేసి.. అక్కడే గాలి ఆడేలా పడుకోబెట్టండి.
  5. రోగి ముక్కును మీ వేళ్ళతో బిగ పట్టండి. అనంతరం మీ నోటి ద్వారా శ్వాస ఇవ్వడం ప్రారంభించండి. ముక్కును అదిమిపట్టడం ద్వారా నోటి నుంచి ఇచ్చే శ్వాస నేరుగా రోగి ఊపిరితిత్తులలోకి వెళుతుంది. లోతైన శ్వాస తీసుకోని.. అలా ఇస్తూనే ఉండండి.. నోటి నుంచి గాలి ఏ విధంగానూ బయటకు పోకుండా జాగ్రత్త వహించండి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి.
  6. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, గుండెపోటు విషయంలో అస్సలు నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. గుండెపోటు వచ్చిన రోగిని వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం వృధా చేయవద్దు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి