Garlic Benefits: ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటున్నారా..? అదిరిపోయే ప్రయోజనాలు

వెల్లుల్లి భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో ఉండేదే. దీనిని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వెల్లుల్లి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి..

Garlic Benefits: ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటున్నారా..? అదిరిపోయే ప్రయోజనాలు
Garlic
Follow us
Subhash Goud

|

Updated on: Oct 07, 2022 | 5:29 PM

వెల్లుల్లి భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో ఉండేదే. దీనిని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వెల్లుల్లి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారిస్తుంది. భారతదేశంలోని ప్రసిద్ధ పోషకాహార నిపుణుడు నిఖిల్ వాట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లుల్లిని ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. క్యాన్సర్ నివారణ: వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉన్నాయి. ఉదయాన్నే ఏమీ తినకుండా వెల్లుల్లిని నమిలితే క్యాన్సర్ ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
  2. మధుమేహానికి ఉపయోగపడుతుంది: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 4 వెల్లుల్లి రెబ్బలు తింటే ఎంతో మంచిదట.
  3. ఇవి కూడా చదవండి
  4. బరువు తగ్గేందుకు: మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి, ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బరువు చాలా వేగంగా తగ్గుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి.
  5. డిప్రెషన్ దూరం: వెల్లుల్లి మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని సహాయంతో మన మనస్సు సమతుల్యంగా ఉంటుంది. డిప్రెషన్‌తో పోరాడే శక్తిని ఇస్తుంది. ఒత్తిడిని నివారించడానికి వెల్లుల్లిని తినమని తరచుగా సలహా ఇస్తారు నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి