Bone Health: మీ ఎముకలు బలహీనంగా మారుతున్నాయా? ఇవి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు

ఇప్పుడున్న రోజుల్లో రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి తదితర కారణాల వల్ల..

Bone Health: మీ ఎముకలు బలహీనంగా మారుతున్నాయా? ఇవి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు
Bone Health
Follow us
Subhash Goud

|

Updated on: Oct 06, 2022 | 9:29 PM

ఇప్పుడున్న రోజుల్లో రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి తదితర కారణాల వల్ల మనిషి వివిధ వ్యాధుల బారిన పడుతున్నాడు. ఆరోగ్యంగా ఉండాలని ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఖనిజాలు, విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం ఎంతో అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఏ పనైనా చేయగలుగుతాం. విటమిన్‌ డి సాధారణంగా సూర్యకాంతి నుంచి ఎక్కువగా లభిస్తుంది. కానీ కాల్షియం ప్రధానంగా మనం తినే ఆహారం.. కూడా ఎముకల మీద ప్రభావం చూపుతుంది. ఎముకలలో సత్తువ కోల్పోవడం, ఇతర వ్యాధులను నివారించడానికి విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మందికి ఎములు బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్యం బారిన పడుతుంటారు. విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.

  1. పాలు: పాలు, ఇతర పాల ఉత్పత్తులు నెయ్యి, జున్ను, వెన్న మొదలైనవి ఎముకలను బలంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా మనం పాలు తాగడం వల్ల శరీరంలోని ఎముకల సాంద్రత పెరుగుతుంది.
  2. ఆకు కూరగాయలు: ఇందులో పోషకాహారాలు అధిక సంఖ్యలో ఉంటాయి. బ్రోకలీ, క్యాబేజీ, కాల్షియం, బచ్చలికూర వంటి వాటిలో మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది.
  3. గుడ్డు: గుడ్డు ప్రోటీన్ కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గుడ్డు లోని పచ్చసొన. శరీరంలో కాల్షియం, విటమిన్ డి స్థాయిలను పెంచుకోవాలనుకుంటే.. గుడ్డు పచ్చసొన తినడం మంచిది.
  4. కొవ్వు చేపలు: సాల్మన్, ట్రౌట్, ట్యూనా వంటి కొవ్వు చేపలు విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యంగా ఉంచడమే గాక మనకు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. ఇది ఎముకలను కూడా బలపరుస్తుంది.
  5. సోయా పాలు: సోయా పాలు లేదా ఇతర సోయా ఆధారిత ఆహారాలు ఎముకల ఆరోగ్యానినికి ఎంతో మంచివి. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటి వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే ఎముకలను బలోపేతం చేయడంలో మెగ్నీషియం, పోటాషియం ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈరెండు పోషకాలు విత్తనాలు, కాయకూరలు, పాలు, అరటి పండ్లు, సోయాలో లభిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి విటమిన్‌ సి, విటమిన్‌ కె. విటమిన్‌ ఎ ఎంతో అవసరం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి