Healthy Food: ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, ఈ హెల్తీ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి..

ఈ ఆహారాలు మార్కెట్లో సులువుగా లభిస్తాయి.. ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు..

Healthy Food: ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, ఈ హెల్తీ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి..
Healthy Life
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 07, 2022 | 8:39 PM

ప్రతి ఒక్కరూ సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటారు. మనం తినే ఆహారం నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చిన్నప్పటి నుంచి సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే.. మన దీర్ఘకాల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అందుకే అరోగ్యకరమైన జీవితానికి.. ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తారు. ఈ రోజు మనం అలాంటి కొన్ని ఆహారాల గురించి చెప్పబోతున్నాం.. వీటిని అత్యంత ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. ఈ ఆహారాలు మార్కెట్లో సులువుగా లభిస్తాయి.. ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.. దీర్ఘాయుష్షు పొందుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

పప్పు ధాన్యాలు: మన వంటింట్లో పప్పు ధాన్యాలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతీ వారం కూడా పప్పు ధాన్యాల ఆహారం తప్పనిసరిగా తింటారు. వాస్తవానికి కాయధాన్యాలు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనవిగా పరిగణిస్తారు. పప్పులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. మీరు ప్రతిరోజూ పప్పులను కూడా తినవచ్చు. దీని వల్ల మీకు ఎక్కువ పోషకాహారం లభిస్తుంది.

నిమ్మకాయ: నిమ్మకాయ పుల్లటి రుచిని దాదాపు అందరూ ఇష్టపడతారు. దీనిలో అనేక ఔషధ గుణాలు.. పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది ప్రపంచంలోని ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా పరిగణిస్తారు. నిమ్మకాయ శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది విటమిన్ సి మంచి మూలం కూడా. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. డైట్ ప్లాన్‌లో నిమ్మకాయను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి: చాలా మందికి వెల్లుల్లి అంటే ఇష్టం ఉండదు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వెల్లుల్లి శరీరంలోని బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని, బీపీని అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లిలో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి.

బీట్‌రూట్‌: బీట్‌రూట్‌ను సలాడ్‌గా తీసుకోవచ్చు. ఇందులోని ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్‌రూట్ మెదడుకు పదును పెట్టడంతోపాటు బీపీని తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్, విటమిన్ సి, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..