Mumbai Fire Accident: 12 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణాలను రక్షించుకునేందుకు..
మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్‌లో 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్‌లో 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో చాలామంది చిక్కుకున్నారు. ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
చెంబూర్‌లోని న్యూ తిలక్ నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో శనివారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగింది. చాలా మంది నివాసితులు తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో బాల్కనీలకు వేలాడుతూ కనిపించారని అధికారులు తెలిపారు. ముంబై అగ్నిమాపక దళం (MFB) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2:43 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందినట్లు వెల్లడించారు. అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అదరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Mumbai | Fire broke out in a residential building in the New Tilak Nagar area. Fire tenders on spot.
The fire has been declared level 2. No loss of life has been reported yet: Mumbai Fire Brigade (MFB) pic.twitter.com/HBZ9uVXJpc
— ANI (@ANI) October 8, 2022
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
