Piyush Goyal: భవిష్యత్తులో ఆ రంగంలో అపార అవకాశాలు.. ఎగుమతులపై దృష్టిసారించాలన్న కేంద్రమంత్రి

దేశంలో పాదరక్షల రంగం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందనుందని, దాదాపు 10 రెట్ల అభివృద్ధి ఈ రంగంలో సాధించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్..

Piyush Goyal: భవిష్యత్తులో ఆ రంగంలో అపార అవకాశాలు.. ఎగుమతులపై దృష్టిసారించాలన్న కేంద్రమంత్రి
Central Minister Piyush Goyal
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 08, 2022 | 2:25 PM

దేశంలో పాదరక్షల రంగం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందనుందని, దాదాపు 10 రెట్ల అభివృద్ధి ఈ రంగంలో సాధించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రంగంలో పనిచేసే కార్మికుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని పాదరక్షల పరిశ్రమ ప్రతినిధులను కోరారు. .ఈ రంగంలో భారత్‌కు అపారమైన సామర్థ్యం ఉందని, సమీప భవిష్యత్తులో ఉత్పత్తిని, ఎగుమతులను 10 రెట్లు పెంచుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగ్రా-లెదర్, ఫుట్‌వేర్ కాంపోనెంట్స్ టెక్నాలజీ ఫెయిర్‌ ను ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు, విదేశీ మారక ద్రవ్య ఆదాయానికి గొప్ప ప్రాముఖ్యత కలిగిన పాదరక్షల రంగానికి సుమారు 7,000 చిన్న పరిశ్రమల యూనిట్లు అనుసంధానించ పడ్డాయన్నారు.  ఈ రంగంలో దాదాపు 40% మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని, భవిష్యత్తులోనూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

భారత్ పాదరక్షల ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశమని, రానున్న కాలంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగగల సామర్థ్యం ఉందన్నారు. ప్రపంచంలోని చర్మశుద్ధిలో దాదాపు 3 బిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం భారత్ కలిగి ఉందని తెలిపారు. దిగుమతులను తగ్గించి ఎగుమతులు పెంచడానికి ఉత్పత్తిదారులు నాణ్యతా ప్రమానాలను పాటించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ నాణ్యత ప్రమణాలు పాటించడం ద్వారా దేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్ లోని భారత ఉత్పత్తులకు బ్రాండ్ క్రియేట్ చేయాలన్నారు. లెదర్ రహిత పాదరక్షల రంగంపై కూడా శ్రద్ధ పెట్టాలని పరిశ్రమల ప్రతినిధులను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కోరారు.

పాదరక్షల రంగానికి సంబంధించి అన్ని ప్రముఖ బ్రాండ్‌లు ముడి పదార్థాల కోసం భారత్‌పైనే ఆధారపడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అధిక విలువ కలిగిన ప్రాజెక్టులతో భారతీయ బ్రాండ్లు ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన కోరారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ లు భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్త మార్కెట్ ఉండేలా కొత్త డిజైన్‌లను రూపొందించడానికి ప్రయత్నించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!