Heroin: గుజరాత్‎లోనూ భారీగా పట్టుబడిన డ్రగ్స్‌.. దొరికిన హెరాయిన్‌ మార్కెట్ విలువ తెలిస్తే కళ్లు బైర్లే..

ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి భారత్‌లోకి తరలిస్తున్న రూ.1,200 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ బోటును, ఆరుగురు ఇరాన్‌ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.

Heroin: గుజరాత్‎లోనూ భారీగా పట్టుబడిన డ్రగ్స్‌.. దొరికిన హెరాయిన్‌ మార్కెట్ విలువ తెలిస్తే కళ్లు బైర్లే..
Gujarat Heroin
Follow us

|

Updated on: Oct 08, 2022 | 12:57 PM

డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ధనార్జనేధ్యేయంగా అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, డ్రగ్స్‌ వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇప్పటికే కేరళ తీరంలో కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ని సీజ్ చేశారు అధికారులు. కాగా, తాజాగా, గుజరాత్‎లో మరోసారి పెద్ద మొత్తంలో నిషేదిత డ్రగ్స్ పట్టుబడింది. పాకిస్తాన్‌ బోటులో అక్రమంగా తరలిస్తుండగా రూ. కోట్ల విలువైన హెరాయిన్ ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత తీర రక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో కలిసి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో ఈ డ్రగ్స్‌ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్థాన్ పడవను అక్టోబర్ 8న పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది కోస్ట్‌గార్డ్‌ బృందం. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.350 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ ATS గుజరాత్‌తో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో ఈ ముఠా పట్టుబడింది. స్వాదీనం చేసుకున్న డ్రగ్స్‌ మార్కెట్ విలువ రూ. 350 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో పాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. అంతకుముందు, సెప్టెంబర్ 14న, సుమారు రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను పాకిస్తానీ బోటు నుండి పట్టుకున్నట్లు ఐసిజి అధికారులు తెలిపారు.

ఆరుగురు సిబ్బందితో పాకిస్థానీ బోటును అదుపులోకి తీసుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్

ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి భారత్‌లోకి తరలిస్తున్న రూ.1,200 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ బోటును, ఆరుగురు ఇరాన్‌ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు భారత అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్‌లోని కార్టెల్‌లు వాటి ప్యాకెట్‌లపై ప్రత్యేకమైన గుర్తులను కలిగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీసు, నిఘా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ రవాణా సాగిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు దుండగులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..