Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modhera Sun Temple: దేశంలోనే తొలి సౌర శక్తితో నడిచే గ్రామం.. అక్కడి సూర్య దేవాలయానికి కొత్త హంగులు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

సూర్యమందిర్ వద్ద హెరిటేజ్ లైటింగ్‌, 3-డి ప్రొజెక్షన్ సౌరశక్తిపై పని చేస్తాయి. ఈ 3-డి ప్రొజెక్షన్ సందర్శకులకు మోధేరా చరిత్రను తెలియజేస్తుంది. ఈ ప్రొజెక్షన్ సాయంత్రం సమయంలో 15 నుంచి..

Modhera Sun Temple: దేశంలోనే తొలి సౌర శక్తితో నడిచే గ్రామం.. అక్కడి సూర్య దేవాలయానికి కొత్త హంగులు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Spectacular light and Sound Show at Modhera Sun Temple
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 08, 2022 | 12:39 PM

ఈఏడాది చివరిలో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రతి నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో పర్యటించాలని నిర్ణయించారు. ప్రధాని పర్యటన సందర్భంగా గుజరాత్ లో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా అక్టోబర్ 9,10 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అక్టోబర్ 9వ తేదీ ఆదివారం మెహసానాలో జరిగే సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అదే రోజు మోధేరా సూర్య దేవాలయంలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభిస్తారు. 3డి ప్రొజెక్షన్ షో ద్వారా సూర్య మందిరం యొక్క ప్రాముఖ్యతను, దేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూర్య మందిరాల సమాచారాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా సౌర విద్యుత్తు ప్రాముఖ్యతను తెలియజేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. 3డి ప్రొజెక్షన్ షో 18 నుండి 20 నిమిషాల నిడివి ఉంటుంది.

సౌర విద్యుత్తుతో నడవనున్న సూర్య దేవాలయం

సూర్యమందిర్ వద్ద హెరిటేజ్ లైటింగ్‌, 3-డి ప్రొజెక్షన్ సౌరశక్తిపై పని చేస్తాయి. ఈ 3-డి ప్రొజెక్షన్ సందర్శకులకు మోధేరా చరిత్రను తెలియజేస్తుంది. ఈ ప్రొజెక్షన్ సాయంత్రం సమయంలో 15 నుంచి 18 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆలయ ప్రాంగణంలో హెరిటేజ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్‌ని చూడటానికి ప్రజలు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు. 3-D ప్రొజెక్షన్ ప్రతిరోజూ రాత్రి 7 నుండి 7.30 వరకు నిర్వహించబడుతుంది.

మోధేరాలో ప్రధాని పర్యటన వివరాలు

మోధేరాలోని మోధేశ్వరి మాతా మందిర్‌ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో సందర్శకులను ఆదివారం మోధేరా సూర్య మందిరంలోకి అనుమతించరు. సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన మోధేరా గ్రామం మొత్తానికి సౌర శక్తితో విద్యుత్తు అందనుంది. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్ ( బిఇఎస్ ఎస్ ) సౌరశక్తితో నడిచే గ్రామంగా మోధేరాను ప్రధానమంత్రి ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం మోధేరా సూర్య దేవాలయం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జన్‌పురా, మెహసానా వద్ద ‘సోలరైజేషన్ ఆఫ్ మోధేరా సూర్య మందిర్ టౌన్’ను ప్రారంభించింది, ఇది బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో సమీకృత సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా మొధేరా గ్రామానికి నిత్యం సౌర విద్యుత్తును అందిస్తుంది. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం 18 ఎకరాల భూమిని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం రెండు దశల్లో 50-50 ప్రాతిపదికన రూ. 80.66 కోట్లు ఖర్చు చేశాయి. మొదటి దశలో రూ.69 కోట్లు, రెండవ దశలో రూ. 11.66 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. మోధేరా గ్రామంలోని ఇళ్లపై 1 కెడబ్ల్యూ యొక్క 1300 కంటే ఎక్కువ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు అమర్చారు. ఈ ప్యానెళ్ల ద్వారా పగటిపూట విద్యుత్తు సరఫరా అవుతుంది. సాయంత్రం సమయంలో BESS ద్వారా గృహాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా, నికర పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే దేశంలోని మొదటి గ్రామం మోధేరా అవుతుంది. అదనంగా సౌరశక్తిపై ఆధారపడిన అల్ట్రా-ఆధునిక విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను కలిగి ఉన్న మొదటి గ్రామంగా కూడా అవతరించనుంది.

గుజరాత్ ముఖ్యమంత్రి స్పందన

మోధేరా సోలార్ పవర్ ప్రాజెక్ట్ గురించి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో గుజరాత్ మరోసారి ముందడుగు వేసినందుకు సంతోషంగా ఉందన్నారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ద్వారా భారతదేశం యొక్క 50శాతం ఇంధన అవసరాలను తీర్చడానికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..