Delhi: ఎనిమిదేళ్ల చిన్నారి దారుణ హత్య.. అన్నపై పగతో దుండగుల కిరాతకం.. పోస్టుమార్టం నివేదికలో..

నిందితుడు నేరం అంగీకరించిన తర్వాత పోలీసులు కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Delhi: ఎనిమిదేళ్ల చిన్నారి దారుణ హత్య.. అన్నపై పగతో దుండగుల కిరాతకం.. పోస్టుమార్టం నివేదికలో..
Crime News
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 08, 2022 | 12:32 PM

ఢిల్లీలోని నరేలాలో ఎనిమిదేళ్ల బాలిక హత్య సంచలనం రేపింది. హత్యకు ముందు బాలిక కిడ్నాప్‌కు గురైంది. హత్య (హత్య నిందితుడు) నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (అక్టోబర్ 7) రాత్రి ఈ నేరం జరిగింది. అదే రోజు రాత్రి 10 గంటలకు పిసిఆర్‌కి ఫోన్‌ కాల్‌ ద్వారా తమకు బాలిక మిస్సింగ్‌ ఫిర్యాదు అందినట్టుగా పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే బాలిక కోసం గాలింపు ప్రారంభించారు.

బాలిక కోసం వెతుకుతున్న సమయంలో ఆ ప్రాంతంలో అమర్చిన సిసిటివి కెమెరాలను స్కాన్ చేసినట్టుగా పోలీసులు వివరించారు. సిసిటివి ఫుటేజ్‌ ఆధారంగా.. అందులో ఒక అమ్మాయి ఒక వ్యక్తితో ఉన్నట్లు చూపిందని పోలీసులు తెలిపారు. సిసిటివి ద్వారా ఆధారాలు లభించడంతో పోలీసులు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్టుగా తెలిపారు. బాలిక సోదరుడితో గొడవపడ్డాడని నిందితుడు చెప్పాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ముందుగా బాలికను కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసినట్టుగా పోలీసు విచారణలో చెప్పాడు.

నిందితుడు నేరం అంగీకరించిన తర్వాత పోలీసులు కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు పోలీసుల విచారణలో లైంగిక వేధింపుల మాటేమీ తెరపైకి రాకపోయినా అమాయకులపై అత్యాచారాలు జరిగే అవకాశం ఉంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

బాలిక తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురికావటంతో.. జరిగిన సంఘటనపై ఆ ప్రాంత ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శనివారం (అక్టోబర్ 8) నరేలా పోలీసు పోస్ట్ వద్ద స్థానికులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. బాలిక తండ్రి గతంలోనే మృతి చెందగా, ఆమె తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. బాలిక తల్లి సమీపంలోని ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే చిన్నారి మరణం ఆ కుటుంబాన్ని మరింత శోకంలో పడేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!