నది మధ్యలో చిక్కుకున్న కారు.. వరద ప్రవాహంలో డ్రైవర్‌ ఆర్తనాదాలు.. ఎలా బయటపడ్డాడో తెలుసా..

మంచు దిబ్బ‌ల కింద చిక్కుకున్న ప‌ర్వ‌తారోహ‌కుల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ ఇప్పటికీ కొన‌సాగుతూనే ఉంది. నాలుగు రోజుల నుంచి గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తుండ‌గా..

నది మధ్యలో చిక్కుకున్న కారు.. వరద ప్రవాహంలో డ్రైవర్‌ ఆర్తనాదాలు.. ఎలా బయటపడ్డాడో తెలుసా..
Uttarakhand River
Follow us

|

Updated on: Oct 08, 2022 | 11:10 AM

ఉత్తరాఖండ్‌ని భారీ వరదలు, హిమపాతం వణికిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరోకటి ఉత్తరాఖండ్‌ని వెంటాడుతున్నాయి. ఉత్త‌రాఖండ్‌లో ఇటీవల సంభవించిన హిమ‌పాతం పదుల సంఖ్యలో పర్వాతరోహకుల ప్రాణాలు బలితీసుకుంది. మంచు దిబ్బ‌ల కింద చిక్కుకున్న ప‌ర్వ‌తారోహ‌కుల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ ఇప్పటికీ కొన‌సాగుతూనే ఉంది. నాలుగు రోజుల నుంచి గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తుండ‌గా ఇప్ప‌టివర‌కు మొత్తం 19 మంది మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్‌సింగ్ ధామి తెలిపారు. మిగ‌తా 10 మంది కోసం సెర్చింగ్ కొన‌సాగుత‌న్న‌ద‌ని చెప్పారు. ఈ క్రమంలోనే ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కారు పడిపోవడంతో అందులో చిక్కుకున్న వ్యక్తిని ఉత్తరాఖండ్‌ రెస్క్యూ బృందం అర్థరాత్రి ఆపరేషన్‌ నిర్వహించి రక్షించింది.

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) అతన్ని సురక్షితంగా రక్షించడానికి ముందు వ్యక్తి పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీ యంత్ర తపూ సమీపంలో నది మధ్యలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 55 సెకన్ల వీడియోలో వ్యక్తి తన కారు పైకప్పుపైన కూర్చున్నట్లు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

రెస్క్యూ టీమ్ సభ్యులు వ్యక్తిని రక్షించడానికి నీటిలో తాళ్లను ఉపయోగించి వాలుపైకి ఎక్కినట్లు వీడియో చూపిస్తుంది. వారు ఎట్టకేలకు అతనిని చేరుకోగలుగుతారు. ముందుగా అతనికి లైఫ్‌ జాకెట్‌ వేయించి అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రక్షించబడిన వ్యక్తి స్థానిక నివాసిగా తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..