Pink Diamond: క్వీన్ ఎలిజబెత్ II కు ఇష్టమైన వజ్రం.. వేలంలో రికార్డు సృష్టించిన పింక్ డైమండ్.. ఇంతకీ స్పెషల్ ఏంటంటే..

ఈ వజ్రాభరణం దివంగత క్వీన్ ఎలిజబెత్ IIకి ఇష్టమైన ఆభరణాలలో ఒకటి. క్వీన్ ఎలిజబెత్ II ఆమె సిల్వర్ జూబ్లీ వేడుకలతో సహా అనేక సందర్భాలలో ఈ ఆభరణాన్ని ధరించారు.

Pink Diamond: క్వీన్ ఎలిజబెత్ II కు ఇష్టమైన వజ్రం.. వేలంలో రికార్డు సృష్టించిన పింక్ డైమండ్.. ఇంతకీ స్పెషల్ ఏంటంటే..
Rare Pink Diamond
Follow us

|

Updated on: Oct 08, 2022 | 10:38 AM

హాంకాంగ్ : క్వీన్ ఎలిజబెత్ IIకి ఇష్టమైన పింక్ డైమండ్ 453 మిలియన్ హాంకాంగ్ డాలర్లకు ($57 మిలియన్లు) అమ్ముడైంది. ఈ వజ్రం క్యారెట్ ధర ఇప్పటివరకు ఏ వేలంలోనూ విక్రయించబడని సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. డైమాండ్‌ క్యారెట్‌కు అత్యధిక ధర.11.15 క్యారెట్ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ హాంకాంగ్‌లో సోత్‌బైస్ అమ్మకానికి కొత్త రికార్డు సృష్టించింది. విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ హాంకాంగ్ వేలంలో $57 మిలియన్లకు అమ్ముడైందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

1953లో కార్టియర్‌కు చెందిన ఫ్రెడరిక్ మేవ్ రూపొందించిన ఈ వజ్రాభరణం దివంగత క్వీన్ ఎలిజబెత్ IIకి ఇష్టమైన ఆభరణాలలో ఒకటి. క్వీన్ ఎలిజబెత్ II ఆమె సిల్వర్ జూబ్లీ వేడుకలతో సహా అనేక సందర్భాలలో ఆభరణాన్ని ధరించారు. ఈ పింక్‌ వజ్రం..453 మిలియన్ హాంకాంగ్ డాలర్లకు ($57 మిలియన్లు) విక్రయించబడింది. దాని అంచనా ధర కంటే రెండు రెట్లు ఎక్కువ ధరతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.11.15 క్యారెట్ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ కొనుగోలుదారు పేరు ప్రకటించలేదు. ఈ ఆభరణం కుషన్ ఆకారంలో రెండు పెద్ద గులాబీ వజ్రాలతో రూపొందించబడింది. వాటిలో ఒకటి 59.60 క్యారెట్లు. విలియమ్సన్ స్టోన్, 23.60 క్యారెట్ డైమండ్ క్వీన్ ఎలిజబెత్ IIకి వివాహ బహుమతిగా ఇవ్వబడింది.

ఇవి కూడా చదవండి
Pink Diamond

ఇకపోతే, ఇలాంటి పింక్ వజ్రాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ వజ్రం వేలంలో విక్రయించబడిన రెండవ అతిపెద్ద గులాబీ వజ్రం. పింక్ వజ్రాలు విలువైన రత్నాలలో అత్యంత అరుదైనవి. గ్లోబల్ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్నవి కూడా. అవి గులాబీ రంగులోకి మారడానికి కారణం ఇప్పటికీ తెలియదు. 1953లో, కార్టియర్ ఫ్రెడెరిక్ మ్యూ పుష్పాకారపు బ్రూచ్ డైమండ్ ఆభరణాన్ని రూపొందించారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

View this post on Instagram

A post shared by ? Uni (@uni.fun)

ఆర్గైల్ అనేది పశ్చిమ ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న వజ్రాల గని, ఇక్కడ అరుదైన వజ్రాలు కనుగొనబడ్డాయి. గని 37 ఏళ్ల ఆపరేషన్ తర్వాత 2020లో మూసివేయబడింది. పింక్ డైమండ్స్ ఇకపై దొరుకుతాయా అనేది కూడా ప్రశ్నార్థకమే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..