Covid 19: కోవిడ్ భయాలు ఇక అక్కర్లేదనుకుంటున్నారా? దిమ్మ తిరిగే హెచ్చరిక చేసిన అమెరికా వైద్య నిపుణుడు..
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని మాయదారి వైరస్ ఆరోగ్యాలనే కాకుండా ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి..
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని మాయదారి వైరస్ ఆరోగ్యాలనే కాకుండా ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. దీంతో మాస్క్‌ల వినియోగం కూడా తగ్గించేశారు. అయితే.. ఇలా రిలాక్స్ కావడం ప్రమాదకరమని చెబుతున్నారు అమెరికాకు చెందిన ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫాసీ. వ్యాక్సిన్‌లతో శరీరంలో ఏర్పడ్డ రోగనిరోధక శక్తిని సైతం తట్టుకునే కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
వచ్చే శీతాకాలంలో కొత్త వేరియంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి అన్ని విధాల సిద్ధంగా ఉండాలని ఫాసీ పేర్కొన్నారు. అమెరికాలో అన్నెన్‌బర్డ్ సెంటర్ ఫర్ హెల్త్ జర్నలిజంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఫాసీ మాట్లాడుతూ.. ‘చలికాలంలో వైరస్‌ల ఉధృతి పెరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రజలు తమ రక్షణను విస్మరించొద్దు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా వైరస్ ఉనికి పూర్తిగా ముగిసిందని చెప్పడం తప్పే అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇక 2021 వేసవిలో స్వల్ప పాండమిక్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయని అయితే అనంతరం వింటర్ నాటికి కేసులు రికార్డు స్థాయిలో పెరగడానికి ఇదే కారణంగా మారాయని తెలిపారు. ఆ సమయం నుచి ఓమిక్రాన్ సబ్ వేరియంట్స్ అమెరికాలో విస్తరించాయని ఫాసీ గుర్తు చేశారు. ఫాసీ అంచనా ప్రకారం ఈ వింటర్‌లో మరిన్ని కొత్త వేరియంట్స్ బలపడే ప్రమాదం ఉందన్నారు. ఇది రోగ నిరోధక శక్తిని ఎదుర్కోగలదని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే రోగ నిరోధక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేయాలని సూచించారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..