AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ ఐదు కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోండి..

అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే కొన్ని రకాల కూరగాయలు తినడం వలన తక్కువ వ్యవధిలో బరువు అదుపులో వస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయి.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ ఐదు కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోండి..
Weight Loss Tips
Surya Kala
|

Updated on: Oct 08, 2022 | 9:41 AM

Share

కాలంతో పోటీ పడుతూ పనులు చేయాల్సి వస్తోంది. ఉద్యోగం, బాధ్యతలు, విధులు ఇవన్నీ మనిషి జీవితంతో పాటు.. శారీరక, మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా బరువు పెరుగుతోంది. దీంతో బరువు తగ్గించే చిట్కాలు ఆరోగ్యకరమైన..  ఫిట్ బాడీగా ఉంచే ఉత్తమ చిట్కాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి కూరగాయలు. ఇవి ఆరోగ్యకరమైన పోషణను అందిస్తాయి.. కనుక ఇవి తినడానికి ఉత్తమైనవి. కూరగాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే కొన్ని రకాల కూరగాయలు తినడం వలన తక్కువ వ్యవధిలో బరువు అదుపులో వస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, పదును పెట్టడానికి కూరగాయలు అత్యుత్తమ ఆహారం. అదే సమయంలో.. ఇది బరువు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.

బరువు తగ్గడానికి తినాల్సిన 5 కూరగాయలు:

  1. బచ్చలికూర: US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి నివేదిక ప్రకారం.. బచ్చలికూర తినడం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించే గుణాలున్నాయి.  ఆరోగ్యకరమైన ఆకుపచ్చని ఈ బచ్చలికూర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.
  2. బ్రోకలీ: బ్రోకలీ క్యాబేజీ కుటుంబానికి చెందిన తినదగిన ఆకుకూర. దీనిలో విటమిన్ కె , కాల్షియం అధికంగా ఉంటాయి. బలమైన,  ఆరోగ్యకరమైన ఎముకలకు అవసరమైన రెండు ముఖ్యమైన పోషకాలు ఈ బ్రోకలీ లో అధికంగా ఉన్నాయి. అంతేకాదు అదనపు ఫైబర్ కలిగి ఉంది. దీంతో బ్రోకలీ బరువు తగ్గడానికి ఉత్తమ మార్గం.
  3. ఇవి కూడా చదవండి
  4. స్పఘెట్టి స్క్వాష్: USDA న్యూట్రియంట్ డేటాబేస్ ప్రకారం, ఒక కప్పు వండిన స్క్వాష్‌లో 42 కేలరీలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. శరీరానికి తగిన పీచుపదార్థాన్ని స్క్వాష్‌ అందిస్తుంది. అంతేకాదు ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది సాంప్రదాయిక వంటలకు ప్రసిద్ధి..
  5. బ్రస్సెల్స్ మొలకలు: కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తిన్న తర్వాత .. కడుపు నిండుతుంది. దీంతో తక్కువ ఆకలి వేస్తుంది.  మూత్రాశయం, ప్రోస్టేట్, కడుపు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్‌ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
  6. పచ్చి బఠానీలు: పాటు కప్పు పచ్చి బఠానీల్లో దాదాపు 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ తో పాటు.. విటమిన్లు సి, ఇ, జింక్ ఇతర యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం పచ్చి బఠాణీలు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఈ కూరగాయలు తీవ్రమైన అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. సమతుల్య ఆహారాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, అధిక ఫైబర్ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లను అందిస్తుంది.

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే..  వృత్తిపరమైన వైద్య సలహాగా తీసుకోకూడదు. ఏదైనా ఫిట్‌నెస్ విధానాన్ని  ప్రారంభించే ముందు వైద్య సలహాను  తీసుకోవాలి. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.