Salman Khan: సల్మాన్ చంపడానికి ప్లాన్ చేస్తోన్న ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ ఒకరు.. పాక్ తో సంబంధాలు
మే 9న మొహాలీలోని పంజాబ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై ఆర్‌పిజి దాడికి సంబంధించి మైనర్ సహా ఇద్దరు ఉగ్రవాద నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు తమ విచారణలో నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారని పోలీసులు తెలిపారు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ లిస్ట్ లో ఉన్నాడు. సల్మాన్ ను చంపడమే తమ లక్షమని కొంతమంది గ్యాంగ్‌స్టర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి వార్తలు వినిపించగా.. తాజాగా సల్మాన్ ఖాన్ చంపడానికి కొంతమంది తీవ్రవాదులు రెడీ అయ్యానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త అందరినీ కలవరపెడుతోంది. వాస్తవానికి.. మే 9న మొహాలీలోని పంజాబ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై RPG దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కొంతమంది తీవ్రవాద నిందితులను అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్‌ను చంపే పనిని ఈ ఉగ్రవాదులకు అప్పగించినట్లు పోలీసులు చెబుతున్నారు. నివేదికల ప్రకారం.. అర్ష్‌దీప్ అనే పేరుమోసిన షూటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు . దీంతో పాటు ఓ మైనర్‌ని కూడా అరెస్టు చేశారు.
సిద్ధూ ముసేవాలా హత్య కేసుకు బాధ్యత వహించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, సల్మాన్ ఖాన్‌ను అంతమొందించడానికి ఒక మైనర్‌కు టాస్క్ ఇచ్చాడని.. తర్వాత ఈ పనిని ఆ మైనర్ నుంచి అమృత్‌సర్‌లో రాణా కండోల్వాలియాకు కాంట్రాక్ట్ ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు.
ఆర్పీజీ దాడిలో పాల్గొన్న నిందితులు: మే 9న మొహాలీలోని పంజాబ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై ఆర్‌పిజి దాడికి సంబంధించి మైనర్ సహా ఇద్దరు ఉగ్రవాద నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు తమ విచారణలో నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారని పోలీసులు తెలిపారు. RPG దాడిలో పాల్గొన్న మైనర్ ఈ సంఘటన సూత్రధారుల్లో ఒకడని..అతను ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ నివాసి అని తెలుస్తోంది.
అరెస్టయిన మైనర్: మే 9న పంజాబ్‌లోని మొహాలీలో జరిగిన ఆర్‌పిజి ఘటనలో ఈ దాడికి పాల్పడిన నిందితులకు కూడా ఆ ఘటనలో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఫైజాబాద్‌కు చెందిన ఆ మైనర్‌ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అరెస్టు చేశారు. అంతేకాదు స్పెషల్ సెల్ నుండి అందిన సమాచారం ప్రకారం.. రాకెట్ లాంచర్ నుండి కాల్పుల కేసులో మైనర్ యువకుడు.. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో మాత్రమే కాకుండా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాది రిండా , లారెన్స్ బిష్ణోయ్ లాండ హరికి కూడా సంబంధం కలిగి ఉన్నాడు. అంతేకాదు కెనడాలో ఉన్న జగ్గు.. భగవాన్‌పురియాతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు కూడా లభించాయని పోలీసులు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..