Nirmala Sitaraman: ” తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు.. ఇక దేశాన్ని ఏం చేస్తారు “.. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి ఫైర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్ఎస్ ను ఇటీవల బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్ఎస్ ను ఇటీవల బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దేశ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌తో ఆవిర్భవించిన టీఆర్ఎస్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేక పోయారని ఆక్షేపించారు. నియామకాలన్న కేసీఆర్ రాష్ట్రంలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. తెలంగాణనే మర్చిపోతున్న టీఆర్ఎస్ దేశానికి ఏం చేస్తుందని ప్రశ్నించారు.
2014 నుంచి 2018 వరకు మహిళలకు రాష్ట్ర కేబినెట్ లో చోటు ఇవ్వలేదు. రెండో సారి అధికారంలోకి వచ్చాక కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షాల డిమాండ్ తో మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు. మహిళలను మంత్రివర్గంలో పెట్టుకుంటే మంచిది కాదని తాంత్రికుడు చెప్పడంతో మహిళలకు అవకాశం కల్పించలేదు. మంత్రాలు, తంత్రాలకు భయపడి కేసీఆర్ సచివాలయానికి వెళ్లలేదు.
– నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
కాగా.. కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారింది. జాతీయ రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్‌ఎస్ మార్పు చేసింది. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఇక పాన్ ఇండియా పార్టీగా మారనుంది. టీఆర్ఎస్ నుంచి BRSకు అప్‌డేట్ అవుతోంది. అందుకే బలాన్ని పెంచుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎంతోమందితో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే గులాబీ బాస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు నేతలు చెప్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..