LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులు అలర్ట్‌.. కొత్త నిబంధనలు అమలు

మీరు కూడా గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగిస్తుంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీరు ఒక సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు తీసుకోవచ్చో తెలుసుకోండి. ఇందు కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు..

LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులు అలర్ట్‌.. కొత్త నిబంధనలు అమలు
Lpg Gas Cylinder
Follow us

|

Updated on: Oct 07, 2022 | 8:47 PM

మీరు కూడా గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగిస్తుంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీరు ఒక సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు తీసుకోవచ్చో తెలుసుకోండి. ఇందు కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. మీరు ఒక సంవత్సరంలో ఎన్ని సిలిండర్లకు దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకోండి. సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మీరు ఏడాదిలో 15 కంటే ఎక్కువ సిలిండర్లను మాత్రమే బుక్‌ చేసుకోవచ్చో తెలుసుకోండి. ఇక నుంచి వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను ఫిక్స్ చేశారు. ఏ కస్టమర్ అయినా ఏడాదికి 15 సిలిండర్లను మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక సంవత్సరంలో 15 కంటే ఎక్కువ సిలిండర్లను తీసుకోలేరు. అదే సమయంలో మీరు ఒక నెలలో 2 కంటే ఎక్కువ సిలిండర్లను తీసుకోలేరు.

ఈ సిలిండర్‌ను తీసుకోవడానికి నెలల కోటా నిర్ణయించబడింది. కొత్తగా విధించిన ఈ నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య ఏడాదిలో 12కి పెరిగింది. మీరు 15 సిలిండర్లు తీసుకుంటే 12 మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. దేశీయ నాన్-సబ్సిడీ కనెక్షన్ వినియోగదారులు తమకు ఇష్టం వచ్చినట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని సరఫరాదారుల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో ఎల్‌పీజీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ రోజుల్లో గ్యాస్‌ సిలిండర్లను వినియోగించే వారు చాలా మంది ఉన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు గ్యాస్‌ సిలిండర్‌పైనే వంట చేసుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను అందిస్తోంది. ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ను అందిస్తోంది కేంద్రం. అయితే ప్రతినెల ఒకటోవ తేదీన గ్యాస్‌ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి గ్యాస్‌ కంపెనీలు.

అక్టోబర్‌లో కొత్త రేట్లు:

ఇవి కూడా చదవండి

ఐఓసీ ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి కొత్త గ్యాస్ ధరలు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1053, ముంబైలో రూ.1052.5, చెన్నైలో రూ.1068.5, కోల్‌కతాలో రూ.1079గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి