Government Loans: యువతకు ష్యూరిటీ లేకుండా లోన్లు.. స్వయం ఉపాధే లక్ష్యం
ఇటీవల కాలంలో యువత ఆలోచనా విధానం మారింది. కష్టపడి చదివి ఉద్యోగం చేసేకంటే చదువు అయిపోయిన తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇలా వ్యాపారం చేయాలనుకునే వారికి పెట్టుబడే ప్రధాన సమస్యగా ఉంటుంది. అయితే బ్యాంకుల ద్వారా వ్యాపార రుణం తీసుకోవాలంటే ష్యూరిటీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారతప్రభుత్వం యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణాలను అందిస్తుంది.

భారత ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం అనేక రకాల పథకాలను నిర్వహిస్తుంది. వివిధ వర్గాల నుండి వచ్చే ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువస్తుంది. చాలా మంది యువత వ్యాపారాన్ని స్థాపించాలని అనుకుంటున్న నేపథ్యంలో వారికి పెట్టుబడికి అవసరమయ్యే సొమ్మును రుణం కింది అందిస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో హామీ లేకుండా ఎవరూ మీకు డబ్బు ఇవ్వరు. కానీ ప్రభుత్వం హామీ లేకుండా మీకు డబ్బు ఇస్తుంది. ప్రధానమంత్రి ముద్ర రుణ పథకంలో మీరు మీ వ్యాపారాన్ని స్థాపించడానికి లేదా దానిని విస్తరించడానికి రుణం తీసుకోవచ్చు.
ముద్ర రుణం ఇవ్వడం అనేది ఇది మీ అవసరం, అర్హత ప్రకారం ఉంటుంది. ముఖ్యంగా ఈ పథకంలో మీరు హామీ లేకుండా రుణం పొందుతారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ఇప్పటివరకు రూ.33 లక్షల కోట్లకు పైగా హామీ లేకుండా రునాలు ఇచ్చారు. ఇందులో శిశు రుణం 50 వేల వరకు అందుబాటులో ఉంది. కిషోర్ రుణం 50 వేల నుండి రూ.5 లక్షల వరకు, తరుణ్ రుణం రూ.5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుంది. తరుణ్ రుణాన్ని తిరిగి చెల్లించడం ఆధారంగా తరుణ్ ప్లస్ రూ.20 లక్షల వరకు అందుబాటులో ఉంది. మీరు https://udyamimitra.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధాన మంత్రి స్వానిధి యోజన
2020 సంవత్సరంలో వీధి వ్యాపారుల వ్యాపారాన్ని స్థాపించడానికి, విస్తరించడానికి భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వానిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, ప్రభుత్వం హామీ లేకుండా రుణం ఇస్తుంది. దీనిని మూడు సార్లు ఇస్తారు. ఈ స్కీమ్‌లో మొదటిసారి రూ. 10 వేల వరకు రుణం ఇస్తారు. ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండోసారి రూ. 20,000 వరకు రుణం ఇస్తారు. మూడోసారి రూ. 50,000 వరకు రుణం ఇస్తారు. ఈ రుణం ఎటువంటి హామీ లేకుండా ఇస్తారు.
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన
సాంప్రదాయ పనులు చేసే చేతివృత్తులవారికి రుణాలు అందించడానికి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని నిర్వహిస్తుంది. ఈ చేతివృత్తులవారికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ప్రభుత్వం రుణాలు అందిస్తుంది. ఇందులో ముందుగా రూ. లక్ష వరకు రుణం ఇస్తారు. ఈ రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లిస్తే మళ్లీ రూ. 2 లక్షల వరకు రుణం ఇస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..