రతన్ టాటా సంపద ఎవరికి చెందుతుంది? వీలునామాలో ఏం రాశారు?
దివంగత పారిశ్రామికవేత్త రతన్‌టాటా వీలునామా వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. టాటా తన ఆస్తుల్లో సింహభాగం ఎవరికి కేటాయించారు?.. అసలు.. వీలునామాలో ఎవరికి ఎంత ఇచ్చారు?.. రతన్ టాటా ఆస్తులు, సంపద ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన ఆయన ఆస్తి సుమారు 10వేలకోట్ల పైనే ఉంటుంది.
వీటి పంపకాలకు సంబంధించి క్లియర్‌కట్‌గా వీలునామా రాసినట్లు తెలుస్తోంది. వాటిలో సుమారు 3,800 కోట్ల సంపదను.. తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌కు కేటాయించారు. తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుపై 800 కోట్లు రాసినట్లు తెలుస్తోంది. ఆయా కేటాయింపుల్లో ఫిక్డ్స్ డిపాజిట్లు, ఖరీదైన పెయింటింగ్స్, వాచ్‌లు వంటివి ఉన్నాయి. రతన్ టాటాకు సన్నిహితుడైన.. మోహిన్ ఎం దత్తాకు కూడా 800 కోట్లు రాయడం మరోసారి ఆసక్తిగా మారింది. తన సోదరుడు జిమ్నీ నావల్ టాటాకు.. రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. మెహిల్ మిస్త్రీ పేరుపై అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను కేటాయించారు. కుక్కలంటే చాలా ఇష్టంగా ప్రేమించే రతన్ టాటా.. శునకాల సంరక్షణ కోసం కూడా 12 లక్షల ఫండ్ కేటాయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి 30వేలు చొప్పున వాటికి ఖర్చుచేసేలా నిధులను కేటాయించారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రముఖ కంపెనీల్లో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరెంట్ తీగలపై మేక విన్యాసాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు
సెలవులకు తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్
దొంగతనంలో వీరి నైపుణ్యం వేరప్పా.. చక్కగా వచ్చారు.. చటుక్కున్న కొట్టేసారు
మీ పిల్లలకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్నారా? ఈ భయంకర వ్యాధులు తప్పవు!
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

