Best stocks: ఈ స్టాక్‌లను కొంటే లాభాల పంటే..ఏడాదిలో 30 శాతం వరకూ రాబడి
ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ వీటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీర్ఘకాలంలో అత్యధిక రాబడి సంపాదించడానికి స్టాక్ మార్కెట్ ఆశాకిరణంలా కనిపిస్తోంది. దీనిలో మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ రాబడి మాత్రం బాగుంటుంది. అనుభవం ఉన్నవారు స్టాక్ మార్కెట్ లో డైరెక్టుగా పెట్టుబడి పెట్టవచ్చు. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ మార్కెట్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు సాగాలి.

ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్ అస్థిరంగానే ఉంది. అయితే కొన్ని బ్రోకరేజ్ సంస్థలు సుమారు 19 నుంచి 30 శాతం అధిక రాబడి ఇవ్వగలిగిన కొన్ని స్టాక్ లను సిఫారసు చేస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొందరికి స్టాక్ లు కొనాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వేటిని ఎంపిక చేసుకోవాలో తెలియదు. అలాంటి వారి కోసం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు కొన్ని స్టాక్ లను సూచించాయి. ఇవి రాబోయే 12 నెలల్లో బలమైన రాబడిని సాధిస్తాయని అంచనా వేస్తున్నాయి. వీటిలో గుజరాత్ గ్యాస్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అఫిల్ (ఇండియా) లిమిటెడ్ ఉన్నాయి. వీటి ద్వారా రాబోయే 12 నెలలకు 19 శాతం నుంచి 34 శాతం వరకూ ఆకర్షణీయమైన అప్ సైడ్ సామర్థ్యాన్ని అందిస్తాయి.
గుజరాత్ గ్యాస్
గుజరాత్ గ్యాస్ పై మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ బై రేటింగ్ ను కొనసాగించింది. రూ.475 లక్ష్య ధరను నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర రూ.399 కాగా, దాదాపు 19 శాతం పెరుగుదలను సూచిస్తుంది. థానే, అహ్మదాబాద్, రాజస్తాన్ లోని గ్రామీణ ప్రాంతాలలో వ్యాపార విస్తరణకు గుజరాత్ గ్యాస్ పెట్టుబడులు పెడుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీ. రాబోయే రోజుల్లో కొన్ని పరిస్థితులు గుజరాత్ గ్యాస్ కు అనుకూలంగా మారతాయని భావిస్తున్నారు.
జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (జేఎస్ఎఫ్బీ)పై నువామా బై రేటింగ్ తో పాటు రూ.600 లక్ష్య ధరతో కవరేజీ ప్రారంభించింది. ప్రస్తుత దీని మార్కెట్ ధర రూ.447 కాగా.. 34 శాతం పెరుగుదలను నమోదయ్యే అవకాశం ఉంది. దేశమంతటా పేదలకు, బ్యాంకు సేవలు అందుబాటులో లేని వారికి సేవ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పెరిగిన ఖర్చులతో పాటు మైక్రో ఫైనాన్స్ లోన్ బుక్ లో క్షీణత కారణంగా 2025 ఆర్థిక సంవత్సరం లాభాలలో అంత పెరుగుదల లేకపోవచ్చు. కానీ 2026 ఆర్థిక సంవత్సరం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
అఫిల్ (ఇండియా) లిమిటెడ్
అఫిల్ (ఇండియా) లిమిటెడ్ లక్ష్య ధర రూ.1880లో మిరే అసెట్ షేర్ ఖాన్ బ్రోకింగ్ కంపెనీ మార్పు చేయలేదు. ప్రస్తుతం ఈ స్టాక్ మార్కెట్ ధర రూ.1460గా ఉంది. ఈ కంపెనీ యాజమాన్యం ఆప్టిక్స్ ఏఐ, హైపర్ – కాంటెక్చువల్, హైపర్ – లోకలైజ్డ్ క్రియేటివ్ లను అందించడం ద్వారా తన 3ఐ వినియోగదారుల ప్లాట్ ఫాంను మెరుగుపర్చుకోనుంది. కనెక్టెడ్ టీవీల (సీటీవీ) ద్వారా కస్టమర్లను పెంచుకోవాలని భావిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..