- Telugu News Photo Gallery Technology photos Best 55 Inch Smart TVs on Amazon, check details in telugu
55 inches TVs: ఇంటిని థియేటర్ చేసే స్మార్ట్ టీవీలు..అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు
గతంలో టీవీ అంటే కేవలం కేబుల్ ఆపరేటర్లు అందించే ప్రోగ్రాములు చూడటానికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ నేడు అనేక ఆధునిక ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో సినిమాలు, వినోద కార్యక్రమాలు, షోలు, ఓటీటీ లో సినిమాలు.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల కార్యక్రమాలను వీక్షించే అవకాశం కలుగుతోంది. అది కూడా సినిమా థియేటర్ లో ఉన్న అనుభవం అందిస్తున్నాయి. వీటిలో సినిమాలు చూడడంతో పాటు గేమ్ లు కూడా ఆడుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటికి చక్కగా సరిపోయే 55 అంగుళాల ఎల్ఈడీ టీవీలు అమెజాన్ లో తక్కువ రేటుకు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Apr 12, 2025 | 5:00 PM

యాప్ లు, ఫైల్స్ ను దాచుకోవడానికి అత్యధిక స్టోరేజీ కావాలనుకునే వారికి హైయర్ 55 అంగుళాల స్మార్ట్ టీవీ బాగుంటుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీతో ఈ టీవీ అందుబాటులోకి వచ్చింది. తద్వారా పనితీరు చాలా వేగవంతంగా ఉంటుంది. హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ ఫీచర్ ద్వారా మీ ఆదేశాలను చక్కగా పాటిస్తుంది. తరచూ రిమోట్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. 4 కే రిజల్యూషన్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, ఈథర్నెట్, హెచ్ డీఎంఐ కనెక్టివీటీ ఎంపికలు అదనపు ప్రత్యేకతలు. 10.8 కిలోగ్రాముల బరువైన ఈ టీవీ ధర అమెజాన్ లో రూ.44,490 ధరకు అందుబాటులో ఉంది.

తక్కువ బడ్జెట్ లో మంచి 55 అంగుళాల స్మార్ట్ టీవీ కావాలనుకునేవారికి హిస్సెన్స్ మంచి ఎంపిక. క్యూ ఎల్ఈడీ డిస్ ప్లే టెక్నాలజీ, 4కే రిజల్యూషన్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 8 మిల్లీ సెకన్ల ప్రతిస్పందన సమయం, బ్ల్యూటూత్, వై-ఫై, యూఎస్బీ, ఈథర్నెట్, హెచ్ డీఎంఐ కనెక్టివిటీ పోర్టులు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అద్భుతమైన డిస్ ప్లే నాణ్యతతో అధునాతన లక్షణాలు కలిగిన ఈ టీవీ బడ్జెట్ కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అమెజాన్ లో ఈ టీవీని రూ.35,999కి కొనుగోలు చేయవచ్చు.

ఇంటిలోనే కూర్చుని థియేటర్ ఉన్న అనుభవం కావాలనుకునే వారికి ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ మంచి ఎంపిక. దీనిలోని 4కే అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే తో మంచి వీక్షణ అనుభవాన్ని పొందవచ్చు. ఏ5 ప్రాసెసర్ 4కే జెన్6 ప్రాసెసర్ తో చిత్రం నాణ్యత చాలా స్పష్టంగా ఉంటుంది. ఆపిల్ ఎయిర్ ప్లేతో మీ ఆపిల్ పరికరం నుంచి మీకు ఇష్టమైన కంటెంట్ ను నేరుగా టీవీలో చూడవచ్చు. అపరిమిత ఓటీటీ యాప్ కు యాక్సెస్ ఉండడంతో వినోదానికి ఢోకా ఉండదు. మంచి గేమింగ్ అనుభవం, ప్రీమియం లుక్, 14.1 కిలోల బరువు, బ్లూటూత్, వైఫై, యూఎస్బీ, హెచ్డీఎంఐ కనెక్టివిటీ తదితర ప్రత్యేతకలు ఉన్నాయి. అమెజాన్ లో ఈ టీవీని రూ.41,990కి కొనుగోలు చేసుకోవచ్చు.

పానాసోనిక్ 55 అంగుళాల స్మార్ట్ టీవీ వివిధ రకాల ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. చక్కని రంగులతో చిత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నలుపు రంగు టీవీ మీ లివింగ్ రూమ్ కు ప్రత్యేక అందం తీసుకువస్తుంది. కేవలం 8 మిల్లీ సెకన్ల ప్రతిస్పందన సమయం, అప్లిగేషన్లు యాప్ లను తెరచినప్పుడు వేగవంతమైన ఇమేజ్ డెలివరీ, డాల్బీ ఆడియో బూస్టర్ తో మంచి సౌండ్ క్వాలిటీ, భారీ గేమ్ లను ఆడుకునే అవకాశం తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వై-ఫై, యూఎస్ బీ, హెచ్ డీఎంఐ పోర్టులు ఉన్నాయి. 11.7 కిలోగ్రాముల పానాసోనిక్ టీవీని అమెజాన్ లో 42,990లకు కొనుగోలు చేయవచ్చు.

తోషిబా 55 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గదిలోని ఏమూల నుంచి అయినా వీక్షించొచ్చు. డైనమిక్, స్పోర్ట్స్, పీసీగేమ్, ఎనర్జీ సేవింగ్, సినిమా, ఫిల్మ్ మేకర్ తదితర మోడ్ లతో ఒకే స్క్రీన్ పై విభిన్న రకాల చిత్రాలను చూడవచ్చు. 4కే రిజల్యూషన్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, కనెక్టివీటీ కోసం వైఫై, యూఎస్బీ, ఈథర్నెట్, హెచ్ డీఎంఐ పోర్టులు ఏర్పాటు చేశారు. 10.9 కిలోగ్రాముల బరువైన తోషిబా టీవీని అమెజాన్ లో 32,999కు అందుబాటులో ఉంది.





























