AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: కొండెక్కిన పసిడి.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఎంత పెరిగిందో తెలిస్తే.!

లకారానికి నాలుగంటే నాలుగే అడుగుల దూరంలో ఉంది బంగారం. అది గట్టిగా పరుగులు పెడితే...ఒక్క రోజులో లక్ష రూపాయలను దాటేసేలా ఉంది. గోల్డ్‌ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అంచనాలను తల్లకిందులు చేసి మరీ... పదండి ముందుకు అంటోంది పసిడి. అయితే ఆ ఒక్కటి జరిగితే మాత్రం పుత్తడి రేటు పడే చాన్స్‌ ఉందంటున్నారు అనలిస్టులు. ఇంతకీ ఏంటది?

Gold Rate: కొండెక్కిన పసిడి.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఎంత పెరిగిందో తెలిస్తే.!
Gold
Balaraju Goud
|

Updated on: Apr 12, 2025 | 8:10 AM

Share

లకారానికి నాలుగంటే నాలుగే అడుగుల దూరంలో ఉంది బంగారం. అది గట్టిగా పరుగులు పెడితే…ఒక్క రోజులో లక్ష రూపాయలను దాటేసేలా ఉంది. గోల్డ్‌ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అంచనాలను తల్లకిందులు చేసి మరీ… పదండి ముందుకు అంటోంది పసిడి. అయితే ఆ ఒక్కటి జరిగితే మాత్రం పుత్తడి రేటు పడే చాన్స్‌ ఉందంటున్నారు అనలిస్టులు. ఇంతకీ ఏంటది?

కొన్నాళ్లుగా నాన్‌స్టాప్‌ రన్నింగ్‌ చేసిన పసిడి రేట్లకు ఈమధ్య కాస్తా బ్రేకులు పడ్డాయి. బంగారం ధరలు కొద్దిగా దిగొచ్చాయి. అయితే మళ్లీ ఒక్కసారిగా గోల్డ్‌ రేట్లు భగ్గుమని ఆల్‌ టైమ్‌ హైకి చేరాయి. లక్ష రూపాయలకు చేరువ అయింది బంగారం. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ.96,540కి చేరింది. గత మూడు రోజుల్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ స్పీడ్ చూస్తుంటే లక్షను దాటేలా కనిపిస్తోంది. 2 రోజుల్లోనే 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 6 వేల దాకా పెరిగింది. ఇక వెండి కిలో ధర…రూ.95,500 పలుకుతోంది.

గత వారం బంగారం ధరలు భారీగా తగ్గినట్లే కనిపించింది. తులం బంగారం కొందామని వినియోగదారులు ప్లాన్ చేసుకునే లోపే మళ్లీ గోల్డ్‌ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా నిలుపుదల చేసిన ట్రంప్‌.. చైనాపై మాత్రం సుంకాల సమరాన్ని కొనసాగించారు. ఆ దేశంపై ఏకంగా 145 శాతం టారిఫ్‌లను విధించారు. దానికి ప్రతిగా చైనా కూడా అమెరికాపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు ఆర్థిక అనిశ్చితికి కారణమయ్యాయి. దీంతో మాంద్యం భయాలు నెలకొన్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ నూరు డాలర్లకు దిగువకు చేరడం పసిడికి మరింత డిమాండ్‌ పెంచింది. సెంట్రల్‌ బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో బంగారం నిల్వలను పెంచుకుంటుండడం..పుత్తడి ధరకు రెక్కలు రావడానికి కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు… బంగారం రేటు తగ్గే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా, చైనా ట్రేడ్‌ వార్‌తో ప్రపంచ ఆర్థిక పరిస్థితి తల్లకిందులు అవుతోంది. అమెరికాను ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ భయాలు అలుముకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లేషన్‌ పెరిగితే, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక ఆయుధం బంగారం మాత్రమే. ఎందుకంటే బంగారాన్ని హెడ్జ్‌ ఫండ్‌గా ఉపయోగిస్తారు.

వజ్రాన్ని వజ్రమే కోస్తుందన్నట్లు ఈ బంగారం నిల్వలే…గోల్డ్‌ రేట్లు తగ్గించవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్న సుంకాల సమరంతో ద్రవ్యోల్బణం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. అదే గనుక జరిగితే ప్రపంచ దేశాల్లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఓ ఐదారు వేల టన్నుల గోల్డ్‌ను ప్రపంచ మార్కెట్‌లో అమ్మకానికి పెడితే.. గోల్డ్‌ రేట్లు ఒక్కసారిగా ఢమాల్‌మనే పరిస్థితి కూడా రావొచ్చనేది విశ్లేషకుల అంచనా. అయితే పరిస్థితులు ఎటు దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us