Health Insurance: ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందా?

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో మొత్తం కుటుంబం ఒకే బీమా మొత్తాన్ని అందుకుంటుంది. ఉదాహరణకు.. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే మీరు 10 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని తీసుకుంటారు. ఆపై కుటుంబంలోని ఎవరైనా 10 లక్షల రూపాయల వరకు చికిత్స పొందవచ్చు. పాలసీ సంవత్సరంలో సభ్యులందరూ కలిసి 10 లక్షల రూపాయల వరకు క్లెయిమ్ చేయవచ్చు. వినోద్‌కు ఫ్లోటర్ పాలసీ ఉంటే దానిలో..

Health Insurance: ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందా?
Health Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Sep 20, 2023 | 5:51 PM

ప్రమాదంలో గాయపడిన వినోద్ ఎనిమిది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని కాపాడలేకపోయారు. అతడి చికిత్సకు బిల్లు 6 లక్షల రూపాయలు అయింది. వినోద్‌కు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉంది. అయితే, ఇప్పుడు అతని మరణం తరువాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా అతని మెడికల్ ఖర్చులు క్లెయిమ్ చేయవచ్చా? అతని హాస్పిటల్ ఖర్చుల కోసం క్లెయిమ్ ఎలా చేయాలి? ఇటువంటి ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతుంటాయి.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రధానంగా మూడు రకాలుగా వస్తాయి:

వ్యక్తిగత, కుటుంబ ఫ్లోటర్ అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ కంపెనీల నియమాలు కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి. వినోద్ లాంటి సమస్య ఉన్న పరిస్థితిలో సాధారణంగా ఏ నియమాలు వర్తిస్తాయో తెలుసుకుందాం.

బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ టీమ్ హెడ్ భాస్కర్ నెహ్రూర్కర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలో, బీమా మొత్తం,ప్రయోజనాలు పాలసీదారుకు స్టాన్‌డర్డ్‌గాగానే ఉంటాయని చెప్పారు. పాలసీదారు మరణించిన తర్వాత పాలసీ ఆగిపోతుంది. పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకుంటే, కంపెనీ నిబంధనలు- షరతుల ప్రకారం ప్రీమియంను రీఫండ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వినోద్ విషయంలో అతని కుటుంబం వైద్య ఖర్చుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చని నెహ్రూర్కర్ చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ మొత్తాన్ని డైరెక్ట్ గా ఆసుపత్రికి బదిలీ చేస్తుంది. ఆసుపత్రి హెల్త్ ఇన్సూరెన్స్ నెట్‌వర్క్‌లో లేకుంటే, పాలసీలో పేర్కొన్న నామినీ తాము చేసిన ఖర్చుల కోసం క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్ కోసం చెల్లింపు చేస్తుంది. పాలసీలో నామినీ లేకుంటే కోర్టు నుంచి వారసత్వానికి సంబంధించిన లెటర్ అవసరం అవుతుంది. అలా అన్ని నిబంధనలు పూర్తి చేసిన తరువాత వినోద్ చట్టపరమైన వారసుడికి బీమా కంపెనీ క్లెయిమ్ చెల్లింపును చేస్తుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో మొత్తం కుటుంబం ఒకే బీమా మొత్తాన్ని అందుకుంటుంది. ఉదాహరణకు.. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే మీరు 10 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని తీసుకుంటారు. ఆపై కుటుంబంలోని ఎవరైనా 10 లక్షల రూపాయల వరకు చికిత్స పొందవచ్చు. పాలసీ సంవత్సరంలో సభ్యులందరూ కలిసి 10 లక్షల రూపాయల వరకు క్లెయిమ్ చేయవచ్చు.

వినోద్‌కు ఫ్లోటర్ పాలసీ ఉంటే దానిలో తగినంత కవర్ మిగిలి ఉంటే, అతని బంధువులు వైద్య ఖర్చుల కోసం క్లెయిమ్ చేయవచ్చు. నిబంధనల ప్రకారం.. బీమా కంపెనీ చేసిన క్లెయిమ్‌ను చెల్లిస్తుంది. ఈ విధానంలో పాలసీదారుడు మరణించినా రెన్యూవల్ టైం వరకు పాలసీ యాక్టివ్ గా ఉంటుంది. కుటుంబ సభ్యులు కవరేజీని పొందుతూనే ఉంటారు.

బీమాదారుడు మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం..

అయితే, పాలసీని ప్రతిపాదించిన వ్యక్తి మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం కుటుంబ బాధ్యత. అలాగే పాలసీదారు మరణించిన తర్వాత బీమా పాలసీలో ప్రపోజర్ పేరును మార్చడం అవసరం. కొత్త ప్రపోజర్ పేరుతో ఫారమ్ నింపి, బీమా కంపెనీకి సమర్పించాలి. దీని ఆధారంగా బీమా కంపెనీ ప్రతిపాదకుడి పేరును మార్చడం ద్వారా కొత్త పాలసీని జారీ చేస్తుంది. సభ్యుడు మరణిస్తే, బీమా పునరుద్ధరణ ప్రీమియం తగ్గిస్తారు. కొత్త ప్రపోజర్ బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు కంపెనీలు బీమా సదుపాయం

చాలా బీమా కంపెనీలు కార్యాలయ ఉద్యోగులకు సమూహ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీగా పనిచేస్తుంది. ఒక ఉద్యోగి మరణించిన సందర్భంలో సంస్థ దాని గురించి బీమా కంపెనీకి తెలియజేస్తుంది. పాలసీ సంవత్సరంలో ఉద్యోగి ఎలాంటి మొత్తాన్ని క్లెయిమ్ చేయకుంటే.. ఉద్యోగి సంస్థ ప్రీమియం వాపసు తీసుకోవచ్చు. ఉద్యోగి సంస్థ వాపసు తీసుకోకుంటే, మరణించిన ఉద్యోగి కుటుంబం పునరుద్ధరణ తేదీ వరకు కవరేజీని అందుకోవడం కొనసాగుతుంది. ఆ తర్వాత, పాలసీ రద్దు అయిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి