AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Lite: యూపీఐ లైట్ ఎందుకు అంతగా ఆదరణ పొందడం లేదు?

ఈ ఫీచర్‌లలో యూపీఐ లైట్, సెప్టెంబర్ 2022లో ప్రారంభించారు. యూపీఐ లైట్ ఒక 'ఆన్-డివైస్ వాలెట్'. దీని అర్థం కస్టమర్స్ వారి యూపీఐ లేదా బ్యాంక్ ఖాతాలనుంచి ఈ యాప్‌కి డబ్బును యాడ్ చేయాలి. ఆ తరువాత ట్రాన్సాక్షన్స్ చేయడం వీలవుతుంది. యూపీఐ లైట్ యాప్ గరిష్టంగా ఒకేసారి 2,000 రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ అప్ డేట్ చేసుకోవచ్చు. దీనిని తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు - స్లో ఇంటర్నెట్..

UPI Lite: యూపీఐ లైట్ ఎందుకు అంతగా ఆదరణ పొందడం లేదు?
Upi Lite
Subhash Goud
|

Updated on: Sep 20, 2023 | 4:49 PM

Share

యూపీఐ ట్రాన్సాక్షన్స్ ప్రతి నెలా కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో దేశం రికార్డు స్థాయిలో 10 బిలియన్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ చూసింది. 2030 నాటికి ప్రతిరోజూ 2 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ సాధించడం దీని లక్ష్యం. దీనిని సాధించడానికి, యూపీఐకి అనేక కొత్త ఫీచర్‌లు యాడ్ చేశారు. ఈ ఫీచర్‌లలో యూపీఐ లైట్, సెప్టెంబర్ 2022లో ప్రారంభించారు. యూపీఐ లైట్ ఒక ‘ఆన్-డివైస్ వాలెట్’. దీని అర్థం కస్టమర్స్ వారి యూపీఐ లేదా బ్యాంక్ ఖాతాలనుంచి ఈ యాప్‌కి డబ్బును యాడ్ చేయాలి. ఆ తరువాత ట్రాన్సాక్షన్స్ చేయడం వీలవుతుంది. యూపీఐ లైట్ యాప్ గరిష్టంగా ఒకేసారి 2,000 రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ అప్ డేట్ చేసుకోవచ్చు. దీనిని తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు – స్లో ఇంటర్నెట్ కనెక్షన్‌లతో పని చేసేలా రూపొందించారు. ఇది ఎటువంటి మొబైల్ బ్యాంకింగ్ యాప్ అవసరం లేకుండా సులభంగా అలాగే వేగవంతమైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి కస్టమర్స్ కు సహాయపడుతుంది.

లావాదేవీల కోసం యూపీఐ లైట్‌కి పిన్ అవసరం లేదు. యూపీఐ లైట్ ఫీచర్‌ని PhonePe, Google Pay – Paytm వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లలో సులభంగా యాక్టివేట్ చేయవచ్చు… BHIM యాప్‌లో కూడా ఉపయోగించవచ్చు. యూజర్ బ్యాంక్ ఎకౌంట్ లింక్ అయి ఉన్నప్పటికీ ఇది బ్యాంక్ రియల్ రియల్ టైమ్ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడదు. అత్యధిక లావాదేవీల సమయంలో కూడా యూపీఐ లైట్ ద్వారా చెల్లింపులు సులభంగా చేయవచ్చు.

అయితే, అన్ని క్లెయిమ్‌లు, ఫీచర్‌లు – ప్రయోజనాలు ఉన్నప్పటికీ, యూపీఐ లైట్ ఆశించినంత విజయవంతం కాలేదు. చాలా మంది ఇప్పటికీ సాధారణ యూపీఐ లావాదేవీలనే ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

దీనికి కారణం ఏమిటి? అనే విషయాన్ని పరిశీలిస్తే.. వాస్తవానికి, అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలలో ఒకటిగా కనిపిస్తుంది. యూపీఐ లైట్ గురించి వినియోగదారులకు పెద్దగా సమాచారం లేదు. యూపీఐ లైట్ రోల్ అవుట్ కూడా నెమ్మదిగా ఉంది. కొన్ని జనాదరణ పొందిన యాప్‌లు మాత్రమే ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. చాలా మంది మొబైల్ నెట్‌వర్క్‌లు దీనికి మద్దతు ఇవ్వవు. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఇది మల్టీ ఎకౌంట్స్ కోసం పనిచేయదు.

యూజర్ కి సంబంధించిన యూపీఐ IDకి లింక్ అయిన అన్ని అకౌంట్స్ యూపీఐ లైట్‌లో ఎనేబుల్ అయ్యే అవకాశం లీవుడ్. మరో విషయం ఏమిటంటే యూపీఐ Lite బ్యాలెన్స్‌పై వడ్డీ రాదు. అనేక కారణాల వల్ల యూపీఐ లైట్ లైట్ పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఉదాహరణకు రిసీవర్ బ్యాంక్‌లో సాంకేతిక సమస్యలు వంటివి చెప్పాచ్చు. యూపీఐ లైట్‌లోనే నెట్‌వర్క్ సమస్యలు ఉంటే కూడా ఇలా జరగవచ్చు.

వ్యక్తిగత ఫైనాన్స్ ఎక్స్ పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ యూపీఐ లైట్ విజయవంతం కాకపోవడానికి ఒక పెద్ద కారణం తక్కువ-విలువ ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు. సాధారణ యూపీఐ ద్వారా ప్రజలు ఇప్పటికే తక్కువ-విలువ ట్రాన్సాక్షన్స్ చేసే వీలుంది. యూపీఐ లైట్ లో ఒకే లావాదేవీ పరిమితి కేవలం 500 రూపాయలు. ఇది చాలా తక్కువ మొత్తం. చాలా మంది ఇప్పటికీ 100 నుంచి 200 రూపాయల మొత్తాలకు క్యాష్ నే ఉపయోగిస్తున్నారు అని వివరించారు జితేంద్ర సోలంకీ.

వ్యాలెట్‌లో గరిష్టంగా 2,000 రూపాయల బ్యాలెన్స్ పరిమితి ఉండటం కూడా ఒక ముఖ్యమైన కారణమని నిపుణులు చెబుతున్నారు. PhonePe వాలెట్ ఇతరులు చాలా సులభంగా లావాదేవీల కోసం ఉపయోగించగలరు… ఈ పరిస్థితిలో యూజర్స్ యూపీఐ లైట్ నుంచి ఎటువంటి అదనపు విలువను పొందడం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి