AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి గుడ్‌న్యూస్‌ రానుందా..?

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇందులో 3 శాతం పెరిగిన తర్వాత అది 45 శాతానికి చేరుతుంది. దీనితో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ కూడా పెరగవచ్చు. ప్రభుత్వం త్వరలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు దీపావళికి ముందు శుభవార్త అందుకోవచ్చు..

Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి గుడ్‌న్యూస్‌ రానుందా..?
Da Hike
Subhash Goud
|

Updated on: Sep 19, 2023 | 4:46 PM

Share

దీపావళి పండగకు ముందే ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని మోడీ సర్కార్‌ పెంచే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఉద్యోగులకు ఈ శుభవార్త దీపావళి పండగకు ముందు వచ్చే అవకాశాలున్నాయి. ఈసారి ఉద్యోగుల డీఏలో మూడు శాతం పెంపుదల ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇందులో 3 శాతం పెరిగిన తర్వాత అది 45 శాతానికి చేరుతుంది. దీనితో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ కూడా పెరగవచ్చు. ప్రభుత్వం త్వరలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు దీపావళికి ముందు శుభవార్త అందుకోవచ్చు.

జీతం ఏ మేరకు పెరుగుతుంది

ఈసారి డీఏ పెంచితే మూడు శాతం పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా తెలిపారు. 4 శాతం డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తే కేంద్ర ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెరుగుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెలా రూ.36,500 ప్రాథమిక వేతనం పొందితే, ప్రస్తుతం అతని డీఏ రూ.15,330. జూలై 2023 నుంచి 3 శాతం డీఏ పెంచితే, వారి డీఏ రూ.1,095 పెరిగి రూ.16,425కి చేరుతుంది. దీంతో పాటు జూలై నుంచి బకాయిలు కూడా అందుతాయి.

కాగా, కరోనా మహమ్మారి కాలంలో సుమారు 18 నెలల పాటు అంటే జనవరి 1, 2020, జూన్ 30, 2021 మధ్య కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏ చెల్లింపులు చేయలేదు. అదేవిధంగా, ఈ కాలంలో పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ అంటే డీఏ చెల్లింపులు చేయలేదు. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే దీని ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి 34,402.32 కోట్ల రూపాయలవరకు ఆదా అయ్యాయి. అయితే వీటిని చెల్లించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం చెల్లించేది లేదని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే వారికి పండగకు శుభ వార్త అందినట్లవుతుంది. ఉద్యోగుల డీఏపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం వెలవరించే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి