UPI Fraud: యూపీఐతో మోసాలు.. వాటిని ఎదుర్కొవడం ఎలా..?

ఆగస్టులో దేశంలో రికార్డు స్థాయిలో 10 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. కానీ యూపీఐకికి పెరుగుతున్న జనాదరణతో, యూపీఐకి సంబంధించిన మోసాలు కూడా పెరుగుతున్నాయి. గత సంవత్సరం బజాజ్ ఫిన్‌సర్వ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రతి నెల సగటున 80,000 యూపీఐ మోసాలు జరుగుతాయని అంచనా వేసింది. అదీకాకుండా ఈ సంవత్సరం మేలో..

UPI Fraud: యూపీఐతో మోసాలు.. వాటిని ఎదుర్కొవడం ఎలా..?
Upi
Follow us

|

Updated on: Sep 18, 2023 | 5:11 PM

మనీష్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లి ఉచ్చులో పడ్డాడు. బిల్లింగ్ కౌంటర్‌లో డబ్బులు చెల్లించి బయల్దేరబోయాడు. సరిగ్గా  అప్పుడు ఒక వ్యక్తీ తనకు సహాయం చేయాలని అడిగాడు. తన తల్లి ఆసుపత్రిలో చేరిందని ఆ వ్యక్తి మనీష్‌తో చెప్పాడు. తానూ ఆమె కోసం కొన్ని మందులు కొనాల్సి ఉందని చెప్పాడు. అయితే, ఫార్మసీలో టెక్నికల్ సమస్య ఉండడంతో తానూ UPI ట్రాన్సాక్షన్ చేయలేకపోయానన్నాడు. తనకు 5 వ వేల రూపాయలు క్యాష్ ఇస్తే.. యూపీఐ ద్వారా తిరిగి ఆ డబ్బు పంపిచేస్తానని చెప్పాడు ఆ వ్యక్తీ. పాపం బాధలో ఉన్నాడని మనీష్ అతనికి 5 వేల రూపాయలు క్యాష్ ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తీ మనీష్ కు థాంక్స్ చెప్పాడు. వెంటనే డబ్బు యూపీఐ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తున్నానని చెప్పాడు. వెంటనే అతని ఫోన్‌లో ట్రాన్సాక్షన్ కి సంబంధించిన మెసేజ్ వచ్చింది.

మెసేజ్ వచ్చింది కదా అని అనుకున్నాడు కానీ.. దానిని సరిగా చూడలేదు. అత్యవసర పని ఉండడంతో అలానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మనీష్. కొద్ది సేపటి తరువాత అతను ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే తన బ్యాంకింగ్ యాప్‌లో తన ఎకౌంట్ చెక్ చేసుకున్నాడు. అప్పుడు తెలిసింది తనకు డబ్బు అందలేదని. యూపీఐకి సంబంధించిన ఇటువంటి మోసాలు దాదాపు ప్రతిరోజూ జరుగుతున్నాయి.

ఆగస్టులో దేశంలో రికార్డు స్థాయిలో 10 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. కానీ యూపీఐకికి పెరుగుతున్న జనాదరణతో, యూపీఐకి సంబంధించిన మోసాలు కూడా పెరుగుతున్నాయి. గత సంవత్సరం బజాజ్ ఫిన్‌సర్వ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రతి నెల సగటున 80,000 యూపీఐ మోసాలు జరుగుతాయని అంచనా వేసింది. అదీకాకుండా ఈ సంవత్సరం మేలో విడుదల చేసిన రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ ప్రాక్సిస్ నివేదిక దేశంలో రిపోర్ట్ అవుతున్న డిజిటల్ మాసాల్లో దాదాపు దాదాపు 55 శాతం యూపీఐ ద్వారా జరిగినట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మూడు రాష్ట్రాల్లో అత్యధిక మోసాలు జరుగుతున్నాయి. అవి ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ యూపీఐ ద్వారా జరుగుతున్న మొత్తం మోసాలలో 30 శాతానికి పైగా ఈ రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. యూపీఐ మోసాలు ఫిషింగ్ దాడులు, మాల్‌వేర్, యూపీఐ ఐడీ స్పూఫింగ్, పరికరాల రిమోట్ మానిటరింగ్ ఇలా మరెన్నోరకాలుగా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.

అంతే కాదు, భవిష్యత్తులో మోసాలకు కృత్రిమ మేధస్సు అంటే AI అలాగే మెషిన్ లెర్నింగ్ కూడా ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు యూపీఐ ఎంత సురక్షితమైనది? అనే సందేహం అందరికీ రావడం సహజం. అయితే, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు కామాక్షి శర్మ యూపీఐ సురక్షితమని చెప్పారు. ఇది పటిష్టమైన వ్యవస్థ. సమస్య యూపీఐతో కాదంటున్నారు. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన మన పరికరాలు యూపీఐకి కనెక్ట్ అయ్యాయి. సిస్టమ్‌లో మాల్వేర్ ఉన్నట్లయితే లేదా ఎవరైనా రిమోట్ యాక్సెస్‌ను పొందినట్లయితే, మన ముఖ్యమైన వ్యక్తిగత వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది మోసం ప్రమాదాన్ని పెంచుతుంది చెప్పారు.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఈ విషయంపై కామాక్షి మాట్లాడుతూ… దీనికి అవగాహన కీలకం అని చెప్పారు. అంటే ప్రజలు తమంతట తాముగా అప్రమత్తంగా ఉండాలి అన్నారు. తమకు తెలియని వ్యక్తితో యూపీఐ పిన్, OTPని షేర్ చేయకూడదాని చెప్పరు. మెరుగైన భద్రత కోసం యూపీఐ ఖాతాలో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రారంభించాలి. ఎప్పటికప్పుడు తమ యూపీఐ లావాదేవీ హిస్టరీని చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా మోసం జరిగితే.. అనధికార లేదా అనుమానాస్పద లావాదేవీలను సులభంగా తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయాల్సిందే

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు