AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Buying: ఇల్లు కొనాలనుకుంటున్నారా..? ఇవన్నీ చెక్‌ చేసుకోవాల్సిందే.. లేకుంటే నష్టపోతారు

ఇంటిని కొనుక్కునేటప్పుడు చేసేటప్పుడు వారు బడ్జెట్ - ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కానీ.. నిర్మాణ నాణ్యత గురించి పెద్దగా పట్టించుకోరు. ఇటీవల గురుగ్రామ్‌లోని చింతల్ ప్యారడైజ్ సొసైటీలో భవనంలో కొంత భాగం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన ఆడిట్ బృందం అక్కడ కొన్ని టవర్లు ఆక్యుపెన్సీకి సురక్షితమైనవి కావని గుర్తించింది..

House Buying: ఇల్లు కొనాలనుకుంటున్నారా..? ఇవన్నీ చెక్‌ చేసుకోవాల్సిందే.. లేకుంటే నష్టపోతారు
Home Buying
Subhash Goud
|

Updated on: Sep 18, 2023 | 4:21 PM

Share

రాజేష్ తన సొసైటీ ఆఫీస్‌కి ఫోన్ చేసి తన ఇంట్లో నీరు సీపెజ్ అవుతుందని ఫిర్యాదు చేశాడు. అలాగే అన్ని గోడలపై పెయింట్ పోయి ఉంది. అతను టీవీని అమర్చడానికి గోడలోకి డ్రిల్లింగ్ చేసినప్పుడు, గోడ ప్లాస్టింగ్ ఊడిపోయింది. అని కూడా వారికీ చెప్పాడు. అయితే కంప్లైంట్ తీసుకున్నామనీ.. దానిని త్వరలో ఎటెండ్ అవుతామనీ సొసైటీ సూపర్‌వైజర్‌ సమాధానమిచ్చారు. ఇప్పటికే ఈ విషయమై తానూ చాలా సార్లు కంప్లైంట్ చేశాననీ.. చాలాసార్లు వీటి రిపేర్లు చేసినా పరిస్థితి ఏమీ మారలేదని రాజేష్ అతనికి చెప్పాడు. అసలు ఇంత నాసిరకం మెటీరియల్ ఎందుకు వాడుతున్నారు అని ప్రశ్నించాడు రాజేష్. అయితే, ఈ విషయంలో తానేమీ చేయలేనని సూపర్‌వైజర్‌బదులిచ్చాడు. రాజేష్ కోపంతో ఫోన్ పెట్టేశాడు.

రాజేష్ లాగానే చాలా మంది ఇంటిని కొనుక్కునేటప్పుడు చేసేటప్పుడు వారు బడ్జెట్ – ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కానీ.. నిర్మాణ నాణ్యత గురించి పెద్దగా పట్టించుకోరు. ఇటీవల గురుగ్రామ్‌లోని చింతల్ ప్యారడైజ్ సొసైటీలో భవనంలో కొంత భాగం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన ఆడిట్ బృందం అక్కడ కొన్ని టవర్లు ఆక్యుపెన్సీకి సురక్షితమైనవి కావని గుర్తించింది.

మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు కాకుండా చూసుకోవడానికి, ఇంటిని కొనే ముందు నిర్మాణ నాణ్యతను తనిఖీ చేయడం చాలా అవసరం. నాసిరకం నిర్మాణాలపై ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక రాజేష్‌కి తెలియలేదు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎలా కంప్లైంట్ చేయాలి అనేది తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఇల్లు లేదా ఫ్లాట్‌ని బుక్ చేసే ముందు, మీరు కొంచెం జాగ్రత్తగా అన్ని అంశాలను రీసెర్చ్ చేస్తే, ఇబ్బందులను నివారించవచ్చు. ఇల్లు బుక్ చేసుకునే ముందు, మీరు ప్రాజెక్ట్ సైట్‌ని సందర్శించాలి. కాంక్రీట్.. ఇటుక పని గురించి పూర్తి సమాచారాన్ని సేకరించండి. మీరు అక్కడ ఉన్న స్ట్రక్చరల్ ఇంజనీర్ నుంచి బిల్డ్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు.

ఇల్లు కొనుక్కునే వారు బిల్డర్ ఇంతకు ముందు పూర్తి చేసిన ప్రాజెక్ట్ లను పరిశీలించవచ్చు. అక్కడ ఇప్పటికే ఉంటున్న రెసిడెంట్స్ తో మాట్లాడవచ్చు. వారు బిల్డ్ క్వాలిటీ విషయంలో శాటిసిఫై అయ్యారా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. బోలెడు డబ్బు పెట్టి ఇల్లు కొనాలని అనుకుంటున్న మీరు చేయగలిగే సులభమైన పని ఇదే అని చెప్పవచ్చు.

లోకల్ అథారిటీస్ ఇచ్చిన యాక్సప్టేన్సీ లెటర్ అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌లను చూపించమని మీరు డెవలపర్‌ని అడగవచ్చు. ఈ ధృవపత్రాలు ప్రాజెక్ట్ ప్రస్తుత నిర్మాణ ఉప-చట్టాలు – ఇతర నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు సూచిస్తాయి. మీరు కొనాలని అనుకుంటున్న ఇంటి ఫినిషింగ్, కిచెన్-బాత్‌రూమ్ ఫిట్టింగ్‌లు, టైల్స్, పెయింటింగ్ వంటి ఇతర విషయాలపై శ్రద్ధ తీసుకోండి. వాటిలో ఏదైనా లోపం కనిపిస్తే దానిని లిస్ట్ చేయండి. ఆ లిస్ట్ ను మీరు డెవలపర్‌కు ఇవ్వడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు.

నిర్మాణ నాణ్యతను అంచనా వేయడానికి మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ సహాయాన్ని పొందవచ్చు. వారు నిర్మాణ నాణ్యతను అంచనా వేయడానికి బిల్డింగ్ లేఅవుట్, డిజైన్, నిర్మాణ సామగ్రిని పరిశీలిస్తారు. పాత ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, స్ట్రక్చరల్ ఇంజనీర్ చేత దాని బలాన్నిచెక్ చేయించండి. RERA అని చెప్పే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టం, నిర్మాణ నాణ్యతలో అవసరమైన మెరుగుదలలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. బిల్డర్ వాగ్దానం చేసిన సౌకర్యాలను బిల్డర్-కొనుగోలుదారు ఒప్పందంలో పేర్కొనాలి. తద్వారా మీరు బిల్డర్‌ను వారి కట్టుబాట్లను నెరవేర్చడంలో విఫలమైనందుకు బాధ్యత వహించేలా చేయవచ్చు.

రెరా (RERA) చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం.. ఏదైనా నిర్మాణ లోపం అంటే నిర్మాణం, పనితనం, నాణ్యత లేదా సేవకు సంబంధించిన లోపం 5 సంవత్సరాలలోపు తలెత్తితే, బిల్డర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా, ఎలాంటి ఛార్జీలు లేకుండా, బిల్డర్ ఈ సమస్యలను పరిష్కరించాలి. పేర్కొన్న సమయంలో లోపాలు సరి చేయకపోయినా.. ఆ లోపాలు అలానే కొనసాగుతున్నా ఇల్లు కొనుక్కున్న వారికీ పరిహారం పొందే హక్కు ఉంటుంది.

ప్రమోటర్ లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, సంబంధిత రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. RERA గృహ కొనుగోలుదారులు రెరాతో పాటుగా వినియోగదారుల కోర్టులలో నిర్మాణ నాణ్యత తక్కువగా ఉన్నందుకు నిర్మాణదారులపై ఫిర్యాదులను కూడా దాఖలు చేయవచ్చు.

రెరా కింద ఫిర్యాదులను ఎలా ఫైల్ చేయవచ్చు?

గృహ కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో – ఆఫ్‌లైన్‌లో కంప్లైంట్ చేయవచ్చు. ఉత్తరప్రదేశ్ రెరా వెబ్‌సైట్‌లో, మీరు ఫిర్యాదు విభాగంలో ఆన్‌లైన్ ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు. అయితే ఫారం-Mని రెరా కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దీనికి ఫీజు 1,000 రూపాయలు వరకు ఉండే అవకాశం ఉంటుంది.

రాజేష్ లాగా, మీ బిల్డింగ్ నిర్మాణ నాణ్యతపై మీకు ఫిర్యాదులు ఉంటే.. బిల్డర్‌కి ముందుగా కంప్లైంట్ చేయండి. ఆ తరువాత బిల్డర్ మీ సమస్యలను పరిష్కరించకపోతే, మీరు రెరాకి కంప్లైంట్ చేయవచ్చు. మీ కంప్లైంట్ ను పరిశీలించిన తరువాత రెరా మీ ఇంటిని రిపేర్ చేయడానికి – నష్టపరిహారాన్ని అందించడానికి బిల్డర్‌కు ఆర్డర్‌లను జారీ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయాల్సిందే