Cancer Health Insurance: క్యాన్సర్ చికిత్స కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?

కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు. మీకు ప్రత్యేక క్యాన్సర్ కవర్ కూడా అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణుడు భక్తి రసాల్ ఈ విషయంపై మాట్లాడుతూ, చాలా మంది వ్యక్తులు తమ సాధారణ ఆరోగ్య బీమా కేన్సర్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను కవర్ చేస్తుందని పొరపాటుగా ఊహించుకుంటారు. అయితే, వాస్తవమేమిటంటే, ప్రామాణిక ఆరోగ్య బీమా ప్లాన్‌లు అన్ని ఖర్చులు లేదా కొత్త చికిత్సలను పూర్తిగా కవర్ చేయకపోవచ్చు. దీని..

Cancer Health Insurance: క్యాన్సర్ చికిత్స కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?
Cancer Health Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2023 | 6:00 AM

ఈ మధ్య మనోరమకు అన్ని వైపుల నుంచి తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టాయి. ఒకవైపు ఆమె స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతోంది. మరోవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. కేన్సర్ చికిత్స కోసం తన సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోయాయి. ఇటు ముదురుతున్న వ్యాధి.. అటు ఆర్థిక భారం.. రెండిటి మధ్య సతమతం అవుతుంది. ఆమె హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉండి ఉంటే.. ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇన్సూరెన్స్ ఉండి ఉంటే తన అనారోగ్యానికి అయిన ఖర్చులకు కొంత వరకూ సహాయపడేది. అందుకే ఆమె ఇప్పుడు పశ్చాత్తాప పడుతోంది.

మనలో చాలా మంది మనోరమ చేసిన తప్పునే చేస్తున్నారు. మనకి ఏమవుతుందిలే.. మనకు అంత కేన్సర్ లాంటి జబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మన హెల్త్ చాలా బావుంది. ఇటువంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం ఎందుకు? అని భావిస్తారు ఎక్కువ మంది. ఇలా ఆలోచించే వారు మరోసారి ఇన్ డెప్త్ లో ఆలోచించండి. ఎందుకంటే, భారతదేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 2022 రిపోర్ట్ ప్రకారం, దేశంలో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య 2022లో ఉన్న 14.6 లక్షల నుంచి 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ సందర్భంలో కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు. మీకు ప్రత్యేక క్యాన్సర్ కవర్ కూడా అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణుడు భక్తి రసాల్ ఈ విషయంపై మాట్లాడుతూ, చాలా మంది వ్యక్తులు తమ సాధారణ ఆరోగ్య బీమా కేన్సర్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను కవర్ చేస్తుందని పొరపాటుగా ఊహించుకుంటారు. అయితే, వాస్తవమేమిటంటే, ప్రామాణిక ఆరోగ్య బీమా ప్లాన్‌లు అన్ని ఖర్చులు లేదా కొత్త చికిత్సలను పూర్తిగా కవర్ చేయకపోవచ్చు. దీని వలన రోగులు – వారి కుటుంబాలు జేబు నుంచి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ” అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అనేక బీమా కంపెనీలు క్యాన్సర్-నిర్దిష్ట బీమా పాలసీలను అందజేస్తుండగా, మరికొందరు తమ క్లిష్ట అనారోగ్య కవరేజీలో వాటిని పక్కకి తప్పిస్తారు. ఈ పాలసీలు సంక్లిష్టంగా ఉంటాయి. అధిక ప్రీమియంలను వసూలు చేయగలవు కాబట్టి మీరు క్యాన్సర్ కవర్‌ను కొనుగోలు చేసే ముందు అర్థం చేసుకోవలసిన కొన్ని సూక్ష్మమైన వివరాలు ఉన్నాయి.

దీనిని అర్ధం చేసుకోవడానికి మూడు క్యాన్సర్-నిర్దిష్ట బీమా పాలసీల లక్షణాలను డీకోడ్ చేద్దాం. మొదటిది న్యూ ఇండియా క్యాన్సర్ గార్డ్. ఈ పాలసీ కింద, 60 ఏళ్ల నాన్-స్మోకర్ పురుషుడు రూ. 21,103 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 50 లక్షల బీమా మొత్తాన్ని పొందవచ్చు. మహిళల విషయానికి వస్తే, 56-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ.28,000 వరకు ఉంటుంది. ఎందుకంటే మహిళలు రొమ్ము – గర్భాశయ  క్యాన్సర్‌కు ఎక్కువ అవకాశం ఉంది. ఈ ప్లాన్ 75 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌లో ఉన్న అతి పెద్ద లోపం ఏమిటంటే, ఇది క్యాన్సర్‌ని తొలిదశలో గుర్తించే వాటిని కవర్ చేయదు.

తర్వాత, ఆదిత్య బిర్లా యాక్టివ్ సెక్యూర్ ప్లాన్ గురించి చూద్దాం. ఇది రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య మంచి ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందించినప్పటికీ, ఈ పాలసీ ప్రారంభ దశ క్యాన్సర్‌కు 180 రోజులు అలాగే క్యాన్సర్ పెద్ద లేదా అధునాతన దశలకు 90 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో వస్తుంది. అంటే క్యాన్సర్ లక్షణాలు ప్రారంభ దశలో 180 రోజులలోపు లేదా ముదిరిన 90 రోజులలోపు అభివృద్ధి చెందితే, మీరు దీని నుంచి ఎటువంటి ప్రయోజనం పొందలేరు.

ఇక ఓరియంటల్ క్యాన్సర్ ప్రొటెక్ట్ ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రారంభంలో, ఈ ప్లాన్ క్యాన్సర్ పెరుగుదలను మినహాయిస్తుంది. కానీ ఈ ప్లాన్ 90 రోజుల పోస్ట్ హాస్పిటల్ ఖర్చులను మాత్రమే కవర్ చేస్తుంది. ఆ తరువాత, రోగి తన స్వంతంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తరుఅవాట్ 100% కవరేజీని అందించే పాలసీని పొందడం దాదాపు అసాధ్యం అని అర్ధం అవుతుంది. అయితే, ఈ పాలసీలు చికిత్సకు అయ్యే ఖర్చులను భరించడంలో కొంత వరకూ హెల్ప్ అవుతాయి.

మీ కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు క్యాన్సర్ నిర్దిష్ట కవర్‌ని పొందడం మంచిది అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్- చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ చతుర్వేది చెప్పారు. అయితే, ఇతర సందర్భాల్లో ఒక మంచి ఇన్సూరెన్స్ మొత్తంతో కాంప్రహేన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ ని తీసుకోవాలి. వివిధ అనారోగ్యాల కోసం ఇండిపెండెంట్ కవర్స్ తీసుకోవాలని అనుకోవడం వివేకవంతమైన ఆలోచన కాకపోవచ్చు. అధిక కవరేజీని పొందడానికి – తక్కువ ప్రీమియం చెల్లించడానికి బేస్ మొత్తంపై సూపర్ టాప్-అప్ కవర్ పొందడం ఉత్తమమైన మార్గం. క్యాన్సర్ ఒక వ్యక్తిని శారీరకంగాప్రభావితం చేసినప్పటికీ, వారి కుటుంబం మొత్తం ఆ బాధను అనుభవిస్తుంది. అటువంటి సందర్భంలో, ఎవరైనా క్యాన్సర్-నిర్దిష్ట బీమాను కలిగి ఉన్నట్లయితే, అలాంటి సందర్భంలో అది ఆర్థికంగా వారికి సహాయకరంగా ఉంటుంది. వారి కుటుంబం ఆర్థిక కష్టాల బారిన పడకుండా ఉంటుంది.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్