Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఓటు వేయనందుకు మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ అవుతాయా? నిజమెంత..?

ఒక వ్యక్తికి బ్యాంక్ ఖాతా లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి డబ్బు తీసివేయబడుతుందని వార్తాపత్రిక క్లిప్పింగ్‌లో కూడా ఉంది. ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తున్న ఈ వార్తలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నట్లు ఈ వార్తల్లో పేర్కొన్నారు. ఓటు వేయని వారిని ఆధార్ కార్డు ద్వారా గుర్తించి ఆ కార్డుతో అనుసంధానించబడిన వారి బ్యాంకు ఖాతా నుంచి రూ.350లను తీసివేయనున్నట్లు ఈ వార్తల్లో ఉంది..

Fact Check: ఓటు వేయనందుకు మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ అవుతాయా? నిజమెంత..?
Pib Fact Check
Follow us
Subhash Goud

|

Updated on: Sep 16, 2023 | 4:09 PM

ఓటు వేయడం ప్రతి సామాన్యుడి హక్కు. అటువంటి పరిస్థితిలో ఓటు వేయకపోతే వారి బ్యాంకు ఖాతా నుంచి రూ.350 తీసివేయబడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి సందేశం మీకు కూడా కనిపించ ఉండవచ్చు. వాస్తవానికి వచ్చే ఏడాది 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో ఎన్నికల కమిషన్‌ను ఉటంకిస్తూ, లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేయకపోవడం కొంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ సందేశం వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా ఈ వార్త న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఫోటో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం.

ఒక వ్యక్తికి బ్యాంక్ ఖాతా లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి డబ్బు తీసివేయబడుతుందని వార్తాపత్రిక క్లిప్పింగ్‌లో కూడా ఉంది. ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తున్న ఈ వార్తలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నట్లు ఈ వార్తల్లో పేర్కొన్నారు. ఓటు వేయని వారిని ఆధార్ కార్డు ద్వారా గుర్తించి ఆ కార్డుతో అనుసంధానించబడిన వారి బ్యాంకు ఖాతా నుంచి రూ.350లను తీసివేయనున్నట్లు ఈ వార్తల్లో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇందులో నిజమెంత..?

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన నిజనిర్ధారణలో ఈ వైరల్ వార్తల వాస్తవాన్ని పేర్కొంది. పీఐబీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వార్త పూర్తిగా ఫేక్. ఎన్నికల కమిషన్ ప్రతినిధి X ఖాతాలో కూడా ట్విట్‌ చేశారు. కొన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అదే సమయంలో ఎన్నికల సంఘం అటువంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ స్పష్టం చేసింది. దీనిని ఎవ్వరు కూడా నమ్మి మోసపోవద్దని సూచించింది. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి, ఓటు వేయండి !! అయితే, ఓటు వేయమని ఎవరూ ఎవరినీ ఒత్తిడి చేయలేరు.. బ్లాక్ మెయిల్ చేయలేరు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే ఇటువంటి కంటెంట్‌ను నమ్మవద్దని పీఐబీ సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌