TATA Steel: టాటా స్టీల్-యూకే ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం.. రూ.5100 కోట్లు ఇచ్చేందుకు బ్రిటన్ అంగీకారం!
యూకే ప్రభుత్వం కాలుష్య స్థాయిలను తగ్గించాలని కోరుకుంటోంది. యూకే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ సైట్ లలో ఒకటై న దాని వెల్ష్ సైట్‌ను డీ కార్బనైజ్ చేయమని టాటా స్టీల్ ని కోరినట్లు తెలుస్తోంది. అయితే టాటా ప్రభుత్వం సహాయం లేకుండా ఏ పని చేసేందుకు ముందుకు రాదు. అది ప్రభుత్వం సహాయం ఉండాల్సిందే. ఇప్పుడు టాటా స్టీల్, బ్రిటిష్ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్‌ను తక్కువ కార్బన్ ఎమిషన్ ప్లాంట్‌గా మారుస్తాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.13,000 కోట్లు. ఇందులో దాదాపు
టాటా స్టీల్ ప్లాంట్ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఒక పెద్ద ఒప్పందం కుదిరింది. టాటా గ్రూప్‌కు 50 కోట్ల పౌండ్లు (సుమారు రూ. 5145 కోట్ల) ఇచ్చేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ప్రభుత్వం అంగీకరించినట్లు అంగీకరించింది. యూకే ప్రభుత్వం కాలుష్య స్థాయిలను తగ్గించాలని కోరుకుంటోంది. యూకే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ సైట్ లలో ఒకటై న దాని వెల్ష్ సైట్‌ను డీ కార్బనైజ్ చేయమని టాటా స్టీల్ ని కోరినట్లు తెలుస్తోంది. అయితే టాటా ప్రభుత్వం సహాయం లేకుండా ఏ పని చేసేందుకు ముందుకు రాదు. అది ప్రభుత్వం సహాయం ఉండాల్సిందే.
ఇప్పుడు టాటా స్టీల్, బ్రిటిష్ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్‌ను తక్కువ కార్బన్ ఎమిషన్ ప్లాంట్‌గా మారుస్తాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.13,000 కోట్లు. ఇందులో దాదాపు రూ.7700 కోట్లను టాటా స్టీల్ పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం, ఈ ప్లాంట్‌లో బొగ్గును కాల్చే కొలిమిని ఉపయోగిస్తారు. ఇది చాలా కాలుష్యానికి కారణమవుతుంది. ఇప్పుడు టాటా స్టీల్ బదులుగా ఎలక్ట్రిక్ ఫర్నేస్‌ను ఉపయోగించనుంది.
3000 ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి
టాటా స్టీల్ యూకే, బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కాలుస్య స్థాయిని తగ్గించుకునేందుకు ఎంతగానో దోహదపడనుంది. అయితే ఇది అక్కడి ఉపాధి పై పెద్ద ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టాటా స్టీల్ యూకే ఫ్యాక్టరీలో దాదాపు 8,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. కర్మాగారం విద్యుదీకరణ కారణంగా సుమారు 3,000 మంది కి ఉపాధి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే విద్యుత్ కొలిమిలో తక్కువ కార్మికులు అవసరం ఉంటుంది. ఇందుకు ఉద్యోగాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం పెట్టిన ఈ పెట్టుబడి బ్రిటన్‌లో 5,000 మందికి ఉద్యోగాలను ఆదా చేస్తుందని బ్రిటన్ వ్యాపార, వాణిజ్య మంత్రి కెమీ బాడెనోచ్ అంటున్నారు. ఈ పెట్టుబడి లేకుండా వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్ సైట్‌ను మూసివేయవలసి వచ్చేది. అలాగే బహుశా దేశంలో ఉక్కు తయారీకి ముగింపు వచ్చేది. మొత్తం దేశం కార్బన్ ఉద్గారాలు దాదాపు 1.5 శాతం మేరకు తగ్గనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ సహాయం లేకుండా దీనిని శిలాజ శక్తి నుంచి గ్రీన్ ఎనర్జీకి బదిలీ చేయడం సాధ్యం కాదని భారత్ టాటా గ్రూప్ బ్రిటిష్ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ ప్లాంట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి