Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Rules: బ్యాంకు దివాలా తీస్తే మీ డిపాజిట్‌కి ఎవరు హామీ ఇస్తారు? ఆర్బీఐ నిబంధనలు ఏమిటి?

బ్యాంకుల్లో మీ డిపాజిట్ల భద్రత గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అలాంటి ఆలోచనలకు భయపడటం మానేయండి. ఎందుకంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అనుబంధ డిఐసిజిసి కింద మన డబ్బు చాలా వరకు భద్రంగా ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ సేవింగ్స్, ఫిక్స్‌డ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్‌లతో సహా బ్యాంకులో ఉన్న దాదాపు అన్ని రకాల డిపాజిట్‌లు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటి..

RBI Rules: బ్యాంకు దివాలా తీస్తే మీ డిపాజిట్‌కి ఎవరు హామీ ఇస్తారు? ఆర్బీఐ నిబంధనలు ఏమిటి?
Bank
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2023 | 5:00 AM

ఎక్కువగా అందరూ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేస్తారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు నమ్మకం పెరగడంతో వారు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెడుతున్నారు. బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సహేతుకమైన వడ్డీతో తమకు కావలసిన విధంగా డబ్బును అందజేస్తాయి. కానీ కొన్నిసార్లు బ్యాంకు వైఫల్యం కస్టమర్‌లను భయపెడుతుంది. అయితే బ్యాంకుల్లో మీ డిపాజిట్ల భద్రత గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అలాంటి ఆలోచనలకు భయపడటం మానేయండి. ఎందుకంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అనుబంధ డిఐసిజిసి కింద మన డబ్బు చాలా వరకు భద్రంగా ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ సేవింగ్స్, ఫిక్స్‌డ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్‌లతో సహా బ్యాంకులో ఉన్న దాదాపు అన్ని రకాల డిపాజిట్‌లు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటి కార్పొరేషన్‌ (DICGC) డీఐసీజీసీ కింద రక్షించబడతాయి. కానీ కొన్ని డిపాజిట్లు డిఐసిజిసి పరిధిలోకి రావు. దాని గురించి తెలుసుకుందాం.

డీఐసీజీసీ పరిధిలోకి రాని డిపాజిట్లు:

1. విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు. 2. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు. 3. ఇంటర్-బ్యాంక్ లావాదేవీల నుంచి డిపాజిట్లు. 4. సహకార బ్యాంకులలో డిపాజిట్.

భారతదేశం వెలుపల పనిచేస్తున్న బ్యాంకులలో డిపాజిట్లు:

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకారం.. డీఐసీజీసీ అసలు, వడ్డీకి గరిష్ట మొత్తం రూ. 5 లక్షల వరకు బీమా కల్పిస్తుంది. మీకు వివిధ బ్యాంకుల్లో బ్యాంకు ఖాతాలు ఉంటే, ఒక్కో ఖాతాకు బీమా పరిమితి ప్రత్యేకంగా వర్తిస్తుంది. అంటే ఒక్కో బ్యాంకులో మీ డబ్బు రూ. 5 లక్షల పరిమితి వరకు బీమా వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

విఫలమైన బ్యాంకుల డిపాజిటర్లతో డీఐసీజీసీ నేరుగా ఇంటరాక్ట్ అవ్వదు. బ్యాంక్ సమస్యలో ఉన్నప్పుడు, బ్యాంక్ మూసివేతను నిర్వహించడానికి బాధ్యత వహించే వ్యక్తి అన్ని డిపాజిటర్ల జాబితాను, వారు బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని సిద్ధం చేస్తారు. ధృవీకరణ, చెల్లింపు కోసం ఈ జాబితా DICGCకి పంపబడుతుంది. డీఐసీజీసీ బ్యాంకుకు డబ్బు ఇస్తుంది. ఆ డబ్బును డిపాజిటర్లకు పంపిణీ చేయడం బ్యాంకు బాధ్యత.

బ్యాంకులు బీమా చేయబడిందా లేదా అని ఎలా తనిఖీ చేయాలి?

బ్యాంకులను బీమా బ్యాంకులుగా నమోదు చేసేటప్పుడు DICGC ముద్రించిన బ్రోచర్‌లను అందిస్తుంది. వారు డీఐసీజీసీ రిజిస్టర్డ్ బ్యాంక్‌గా బ్యాంక్ స్థితిని తెలుసుకోవాలనుకుంటే, వారు ఈ విషయంలో శాఖ అధికారిని అడగవచ్చు. డిపాజిటర్లకు డీఐసీజీసీ అందించే రక్షణ గురించిన సమాచారాన్ని బ్రోచర్‌లు కలిగి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి