PM Modi Birthday-Foxconn: వచ్చే ఏడాది ప్రధాని మోడీకి గొప్ప బహుమతి అందజేస్తాం.. ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన..

Foxconn investment in India: తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే పన్నెండు నెలల్లో భారతదేశంలో తమ పెట్టుబడులు, శ్రామిక శక్తిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నట్లు భారతదేశంలోని ఫాక్స్‌కాన్ ప్రతినిధి వి లీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73వ పుట్టినరోజును పురస్కరించుకుని వీ లీ (V Lee) కీలక ప్రకటన చేశారు.

PM Modi Birthday-Foxconn: వచ్చే ఏడాది ప్రధాని మోడీకి గొప్ప బహుమతి అందజేస్తాం.. ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన..
Foxconn Investment In India
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 18, 2023 | 1:39 PM

Foxconn investment in India: తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే పన్నెండు నెలల్లో భారతదేశంలో తమ పెట్టుబడులు, శ్రామిక శక్తిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నట్లు భారతదేశంలోని ఫాక్స్‌కాన్ ప్రతినిధి వి లీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73వ పుట్టినరోజును పురస్కరించుకుని వీ లీ (V Lee) కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వీలీ.. భారత్‌లో పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు మరింత కష్టపడి పనిస్తామని స్పష్టంచేశారు. ‘‘గౌరవనీయులైన ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ నాయకత్వంలో ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా.. వేగంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో ఉపాధి, ఎఫ్‌డిఐ, వ్యాపార పరిమాణాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో వచ్చే ఏడాది మీకు గొప్ప పుట్టినరోజు బహుమతిని అందించడానికి మేము మరింత కష్టపడి పని చేస్తాము.’’ అంటూ ఫాక్స్‌కాన్ భారత ప్రతినిధి వీలీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల వేదికగా తెలిపారు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ… ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ, సరఫరాదారుగా ఉంది. తైవాన్ కంపెనీ చైనా నుంచి వైదొలగాలని కోరుకుంటున్న నేపథ్యంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న తమ కంపెనీ ప్లాంట్లలోని తయారీ సౌకర్యాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశంలో తన ఉనికిని వేగంగా విస్తరించాలని కోరుకుంటున్న నేపథ్యంలో వీలీ ఈ విధంగా పోస్ట్ చేసి తెలిపారు.

కాగా.. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధి వీ లీ చేసిన పోస్ట్ పై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రణాళికలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వీలీ పోస్ట్ ను షేర్ చేసిన అశ్వినీ వైషన్.. ఫాక్స్‌కాన్ కంపెనీ మద్దతును సులభతరం చేయడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉందంటూ సమాధానమిచ్చారు. వీలీ తాజా ప్రకటనలో భారత్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీ పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. ఉపాధితోపాటు ఉద్యోగాలు కూడా భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.

అశ్విని వైష్ణవ్ ట్వీట్..

కాగా.. ఆపిల్‌కు ప్రధాన సరఫరాదారు అయిన ఫాక్స్‌కాన్, వచ్చే ఏడాదిలోగా తన వర్క్‌ఫోర్స్, పెట్టుబడిని రెట్టింపు చేయడం ద్వారా భారతదేశంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకోవాలని చూస్తోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారుగా పేరుగాంచిన తైవాన్ ఆధారిత టెక్ దిగ్గజం, చైనాపై ఆధారపడకుండా మరింత శక్తివంతంగా మారాలనే లక్ష్యంతో, తయారీ సౌకర్యాలలో, ముఖ్యంగా దేశంలోని దక్షిణ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టి, భారతదేశంలో తన కార్యకలాపాలను వేగంగా పెంచుతోంది. ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపిన వీలీ.. కంపెనీ పెట్టుబడుల విస్తరణకు సంబంధించి నిర్దిష్ట వివరాలను అందించలేదు..

ప్రస్తుతం, ఫాక్స్‌కాన్ తమిళనాడులో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.. ఇందులో 40,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆగస్టులో ఒక ముఖ్యమైన చర్యలో, రాష్ట్రంలోని రెండు కీలకమైన ప్రాజెక్టుల కోసం ఫాక్స్‌కాన్ గణనీయమైన పెట్టుబడి $600 మిలియన్లను కర్ణాటక రాష్ట్రంలో ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లు కంపెనీ వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలను ప్రదర్శిస్తూ iPhoneలు, చిప్-మేకింగ్ పరికరాల కోసం కేసింగ్ భాగాలను తయారు చేయడంపై దృష్టి సారించాయి. చైర్మెన్ లియు యంగ్-వే గత నెలలో సంపాదన బ్రీఫింగ్ సందర్భంగా భారతదేశంలో తాము చూసే సామర్థ్యాన్ని నొక్కిచెప్పారు, “అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒక ప్రారంభం మాత్రమే” అని పేర్కొంటూ భారతీయ మార్కెట్‌లో మరింతగా స్థిరపడాలనే ఫాక్స్‌కాన్ నిబద్ధతను నొక్కిచెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..